Posts

Showing posts from November, 2017

motivational story

Image
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కథ కలిసిమెలిసి జీవిద్దాం ఒక సైకాలజీ సెమినార్ క్లాసు జరుగుతుంది.... దాదాపు 300 మంది ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.. ఇంతలో అకస్మాత్తుగా ప్రసంగీకుడు పాఠం ఆపి అందరినీ ఒక పేద్ద హాలు దగ్గరికి తీసుకు వెళ్తాడు... మీకు ఒక గ్రూప్ యాక్టివిటీ ఇస్తున్నను అని అందరికీ  తలా ఒక బెలూను ఇచ్చి దానిని ఊది బెలూను మీద ఎవరి పేర్లు వారు వ్రాసి ఆ హాలు లో వేయమని ఆదేశిస్తాడు... అందరూ ఆ లెక్చరర్ చెప్పిన విధంగా చేస్తారు.. అపుడు ఆ హాలంతా బెలూన్లతో నిండి పోతుంది... ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ లెక్చరర్... మీ అందరికీ ఇంకొక ఐదు నిమిషాలు సమయమిస్తాను.. ఎంత మంది తమ బెలూన్లను కనుగొనగలరో ప్రయత్నించండి... ముందు వచ్చిన వారు నిజమైన సమర్ధులు అని చిన్న కాంపిటిషన్ లా చెపుతాడు.... ఇక అందరిలో టెన్షన్ పెరిగి ఎవరికి వారు ప్రయత్నించడంలో పోటీలు పడి చివరికి ఒక్కరు కూడా తమ బెలూన్ పొందలేకపోతారు... ఈసారి ఆ లెక్చరర్.. మీరొక పని చేయండి... అందరూ లైన్ లో నిలబడి ఒకరు బెలూన్ తీసుకుని దాని మీద ఉన్న పేరు చదవండి .. మిగిలిన వారిలో ఆ పేరు గల వారు బెలూన్ తీసుకోండి అని అనౌన్స్ చేస్తాడు... ఈసారి కేవలం మూడు ...