శ్రీరామనవమి,SriramaNavami

శ్రీరామనవమి శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. చైత్ర నవమి, చైత్ర మాసంలోని 9వ రోజు ఈ పండుగ జరుపుకుంటారు. వేడుకలు: పూజలు, వ్రతాలు, ఉపవాసాలు. ప్రాముఖ్యత: రాముడి పుట్టినరోజు మరియు రామాసీతా పెళ్లిరోజు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. ఇతిహాసంలో మొదటిది అయిన రామాయణం ప్రకారం అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు:కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర...