గోరింటాకు
గోరింటాకు
గోరింట చెట్టు కొంతమంది ఆకుల కోసం పెంచుతారు.గోరింటాకును ముద్దగా నూరి చేతికి, పాదాలకు పెట్టుకుంటే ఎర్ర్రని రంగుతో అందంగా ఉంటాయి. ఈ పొడిలో లవంగం పొడి కలిపితే ఎరుపు, ఉసిరి పొడిని కలిపితే నలుపు రంగు తల జుట్టుకు వస్తాయి.భారతీయులు పెళ్ళి సమయంలో దీన్ని తప్పనిసరిగా వాడతారు. మెహందీ లేదా హెన్నాఅనేది "మెంధిక" అనేసంస్కృతపదంనుండిఉద్భవించింది. మెహందీ మరియు పసుపులయొక్క ఉపయోగంముల గురించి హిందూమ తవేదకర్మ పుస్తకాల్లోవర్ణించబడింది. హల్దిని (పసుపుముద్ద)అభిరంజనముగా, అలాగే మెహందీని బాహ్య ప్రతీకగా వేదాలలో చెబుతారు. వేద సిద్దాంతమూలలో ఇది "అంతర్గతంగ కాంతి లేవడం" అనే అర్ధం వస్తుంధి. సాంప్రదాయభారతనమూనాలలో మెహందీని చేతులు మరియు కాళ్ళుగుర్చిఉద్దేశించబడింది.
పాశ్చాత్య ప్రపంచంలో హెన్నా (గోరింట)అని పిలుస్తారు. భారతదేశం మరియు నేపాల్ దేశాలాలో మేహేందిని శరీర అలంకరణగా వాడతారు. భారతీయ సినిమా అయిన బాలీవుడ్, పాకిస్తాన్, బంగ్లాదేశీలు మరియు అలాగే ఇతర దేశాలు కూడా మేహేందిని ఉపయోగిస్తారు. కోఆపరేషన్ కౌన్సిల్ ప్రకారం ఈ సంప్రదాయం గల్ఫ్ జాతీయులు అయిన ఆరబ్ దేశాల మహిళలు ఎక్కువగ ఉపయొగించుట ద్వారా విస్థరించింది.. మెహందీ అలంకరణను వారు కొన్నిసార్లు గోరింట పచ్చబొట్లు (హెన్నాటటూ) అని పిలుస్తుంటారు. 1990 ల చివరిలో పశ్చిమములోఇది ఒక నాగరీకంగా మారింది.
మెహందీని సాధారణంగా వివాహనికి మరియు ఖర్వ చౌత్, ఆషాఢ శుద్ధ పూర్ణిమ, దీపావళి, భైదూజ్ మరియు తీజ్ వంటి పండుగలు వంటి ప్రత్యేక హిందూ మతం సందర్భాలలో సమయంలో వాడతారు. హిందూ మతం పండుగలలో
భారత సాంప్రదాయ మెహందీని పెట్టేకళాకారు లుపరిమితసంఖ్యలో ఉండటం కారణముగా,ఆధునిక యుగంలో ప్రజలు రెడీమేడ్ హెన్నాన్ని (హెన్న ఛొనెస్) ఉపయోగిస్తున్నారు. రెడీమేడ్ హెన్నా ఆలంకరణకు సులభంగా ఉంటుంది.అయితే, భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వృత్తిపరంగా దొరికే గోరింట ఆకులుని శుద్ధి చేసి,వీటికి ఆయిల్ కలిపి రాళ్ళుతొ నూరి ఆ మిశ్రమన్ని మెహందీగా వాడతారు. మెహందీని చాలా సందర్భలలో తాత్కలిక పచ్చబొట్లుగా ఉపయోగిస్తారు.దీన్నే గోరింట పచ్చబొట్టు అలంకరనగా పిలుస్తారు. నల్లని పచ్చబొట్టును ధరించడం కోసం,అనేక మంది గోరింటాకుకు కృత్రిమరంగును కలపడం ఆరంబించారు. దీని వల్ల చర్మానికి చాలా హానికరమైన మరియు శాశ్వతగాయాలు,తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆలాటా అనే ఒక రకమైన గొరింటను వధువల పాదాల అలకరణకు ఉపయోగిస్తారు. ఈ సంస్క్రుతి ఇప్పటికి బెంగాల్లో వాడుకలో ఉన్నధి.
గోరింటాకు ఎర్రగా పండాలంటే...
మహిళల అలంకరణ ప్రాధాన్యాల్లో గోరింటాకుది ప్రత్యేకమైన స్థానం. అట్లతద్ది వంటి పండుగలకు గోరింటాకు పెట్టుకోవటం తెలుగు నేల ఆనవాయితీ. చిన్నశుభకార్యం మొదలు పండగలూ, పెళ్ళిళ్ళ వరకు మహిళలు గోరింటాకు పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతారు. గోరింటాకుతో పండిన చేతులు, పాదాల అందాన్ని ఏ నగల, దుస్తులతో పోల్చలేమంటే అతిశయోక్తి కాదు. గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని తెలుగు నాట వాడుకలో ఉన్నమాట.
అవకాశం ఉన్నవారు సాధ్యమైనంతవరకు చెట్టు నుంచి సేకరించిన తాజా గోరింటాకును రుబ్బి వాడటం మంచిది. లేని పక్షంలో మార్కెట్లో లభించే మంచి నాణ్యమైన గోరింటాకును ఎంపిక చేసుకోవాలి. గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడినీళ్ళు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్ టీలో కనుక కలిపి నానబెట్టినట్లైతే మరింత డార్క్ కలర్ తో గోరింట పండుతుంది. మెహిందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్ కలిపుకొని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు చేతులకు పెట్టుకోవడం వల్ల చేతులు పెట్టుకొన్నట్లైతే కాఫీ బ్రౌన్ కలర్‌లో పండుతుంది. నిమ్మరసంలో పంచదార వేసి చిక్కటి సిరఫ్‌లా తయారుచేసుకోవాలి.
మెహింది చేతులకు పెట్టుకొన్న తర్వాత తడి ఆరేసమయంలో ఈ లెమన్ సుగర్ సిరఫ్ ను చేతులకు అప్లై చేయాలి. దాని వల్ల మెహిందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది ఈ సిరఫ్. గోరింటాకు చేతులకు పెట్టుకొన్న తర్వాత అది చేతుల మీద కనీసం ఆరుగంట సమయం అన్నా ఉండేట్లు చూసుకోవాలి. అందుకు లెమన్ సుగర్ సిరఫ్ ను మధ్య మధ్యలో రాస్తుంటే మీరు కోరుకొన్న కలర్ మీ చేతుల్లో పండుతుంది. లవంగాలను ఒక పాన్ లో వేసి వేయించాలి. వేయించే సమయంలో వచ్చే పొగ మీద రెండు చేతులను ఒక అంగుళం దూరంలో పెట్టి ఆవిరి పట్టించాలి.
ఆ పొగ చేతులకు వేడి పుట్టించి మెహిందీ మరింత ఎర్రగా పండేలా చేస్తుంది. మెహిందీ పెట్టుకొన్న తర్వాత ఈ పెయిన్ రిలిఫీ బామ్ ను అప్లై చేయడమనేది చాల పాత పద్దతి. దీన్ని ఉపయోగించడం వల్ల చేతులకు వేడి పుట్టించి మెహిందీ బాగా ఎర్రగా పండేలా చేస్తుంది. హెన్నా మిశ్రమానికి ఆవనూనె కలిపి గిన్నెలో పెట్టి దానిపై పొడి గుడ్డ కప్పి 10 గంటల పాటు పొడి వాతావరణంలో ఉంచి వాడితే బాగా పండుతుంది. గోరింటాకు పండిన తర్వాత నేరుగా నీళ్ళు పోసి కడగ కూడదు. ఎండిన హెన్నాను చెంచా లేదా చాకుతో నెమ్మదిగా తొలగించి అరచేతులపై కొంచెం సున్నం (తాంబులంలో వాడేది) వేసి రెండు అరచేతులూ బాగా రుద్ది నీటితో కడగాలి. ఎలర్జీలు బాధితులు సున్నా నికి బదులు కొబ్బరి నూనె తో రుద్దుకొని నీళ్ళతో కడిగితే రంగు ఎక్కువ కాలం నిలుస్తుంది. గోరింటాకు మిశ్రమానికి పుదీనా గుజ్జు లేక పుదీనా నూనె కలిపితే మరింత పండుతుంది.
గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండటమే కాదు... వ్యాధులకు ఔషధంగా కూడా...
స్త్రీల అలంకరణ సాధనాల్లో గోరింటాకు ఒకటి. గోరింటాకు ఎన్నో ఔషధగుణాలను కలిగిందని మన పూర్వీకులు దాన్ని అలంకరణకు ఉపయోగిస్తూ వచ్చారు. కొందరు వారి ఇంటి పెరటిలో ఈ చెట్లను పెంచుకుంటారు. పెళ్లికూతుర్ని అలంకరించేందుకు, పండుగ సమయంలో భారతీయులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం ఎవరూ ఎక్కువగా గోరింటాకును ఉపయోగించట్లేదు. రెడీమెడ్‌గా చేసిన మెహందీనే అందరూ వాడుతున్నారు.
గోరింట పువ్వు, ఆకులు, వేర్లు, విత్తనాలు, బెరడు అన్నీ ఔషధగుణాలను కలిగింది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. గోరింటాకులోని ఔషధ ఫలితాలను పలు అంతర్జాతీయ నిపుణులు పరిశోధనలతో కనిపెట్టారు. అయితే కొన్ని సంవత్సరాలకు మునుపే ఆయుర్వేదపరంగా గోరింటాకుని ఉపయోగించి రోగాలను నయం చేశారు. డాక్టర్ ఎమర్సన్ మెహందీ ఆయిల్ శరీరానికి పూసినట్లైతే చర్మంపై ఏర్పడే మంటను తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందని కనిపెట్టారు.
డాక్టర్ ఎయిన్‌సిలిక్ గోరింటాకు పువ్వులు కుష్టు వ్యాధిని, చర్మ వ్యాధిని నయం చేయవచ్చని కనిపెట్టారు. పైత్యానికి సంబంధించిన వ్యాధిని తగ్గించే గుణం గోరింటాకులో ఉందని డాక్టర్ హెన్రీ పేకర్ తెలిపారు.
కాళ్ళు, చేతుల దురద
చేతులు, కాళ్ళు మంటలను తగ్గించేందుకు గోరింటాకులో బాగా నీళ్లు పోసి నూరి అందులో నిమ్మరసం కలిపి చేతులు, కాళ్లు, పాదాలవరకు రుద్దితే మంటలు వెంటనే తగ్గిపోతుంది.
గోరుచుట్టు
మన పూర్వీకులు గోళ్ల చుట్టూ గోరింటాకు నూరి పెట్టుకుంటారు. దీని మూలంగా గోళ్లు అందంగా మారుతాయి. అయితే ప్రస్తుత కాలంలో నెయిల్ పాలిష్ అనే పేరులో పలు రకాలు వచ్చాయి. వీటిలో రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల ఔషద ఫలితాలు ఏమి లేదు. అయితే గోరింటాకు ఎక్కువ ఔషద గుణాలను కలిగిఉంది. గోళ్లలో ఏర్పడే పుండ్లు, పుచ్చులు లాంటిని గోరింటాకు నయం చేస్తుంది.
లైంగిక వ్యాధుల బారిన పడిన వారు గోరింటాకు ఆరు గ్రాములు, వెల్లుల్లి ఒకటి, మిరియాలు ఐదు కలిపి దంచి తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయాన్నె తిన్నట్లైతే లైంగిక వ్యాధులు తగ్గుతాయట. ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గువగా తిన్నాలి. ఎక్కువ కారం, చింతపండు, తినకూడదు.
బెణికిన చోట..
గోరింటాకుని నీటిలో రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నె ఉడికించి కషాయంగా చేసి బెణికిన చోట, చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డ భాగంలో ఒత్తడం చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
మంచి నిద్ర కోసం
గోరింటాకు పువ్వులను తల క్రింద పెట్టి నిద్రపోయినట్లైతే గాఢనిద్ర వస్తుంది. ఇంకా మెదడులో ఏర్పడిన వేడిని తగ్గించి శరీరానికి, మనసుకి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. గోరింటారు వేరు, బెరడుని నూరి పాలులో కలిపి తాగే అలవాటు చేసుకుంటే అధిక రక్తస్రావం నయం అవుతుంది. పైత్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని క్రమరీతిలో ఉంచేందుకు కూడా గోరింటాకు సహాయపడుతుంది.

గోరింటాకు పెట్టుకుంటే చేతులకు ఎర్ర రంగు ఎలా వస్తుంది?
మన దేహంపై ఉండే చర్మం నాలుగు పొరలు కలిగి ఉంటుంది. వీటిలో అన్నింటి కన్నా పైన ఉండే పొరను స్ట్రేటమ్‌కార్మియమ్ అని, దాని కింది పొరను ఎపిడెర్మిస్ అని, తర్వాతి పొరను డెర్మిస్ అని, అన్నిటి కన్నా కింద ఉండే పొరను సబ్‌క్యూటేనియస్ అని అంటారు. సున్నితమైన చేతికి గోరింటాకును కొంచెం నీటితో కలిపి నూరి పెట్టగానే దానిలో ఉండే ఎర్రని రంగు చేతిలోని చర్మంపై అన్నిటి కన్నా పైన ఉండే స్ట్రేటమ్‌కార్మియమ్‌లో ప్రవేశించి దాని కింద ఉండే ఎపిడెర్మిస్ దగ్గరకు చేరుకుంటుంది. అంతకుమించి మిగతా పొరలలోనికి ప్రవేశించదు.
గోరింటాకు...మహిళలు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఏ ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే. ఆషాడం వచ్చిందంటే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉండడమే కాకుండా ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో శరీరంలోని వేడి, బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు.
గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి గుణం పుష్కలంగా ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది.
గోరింటాకులో బాగా నీళ్లు పోసి నూరి అందులో నిమ్మరసం కలిపి చేతులు, కాళ్లు, పాదాలవరకు రుద్దితే మంటలు తగ్గుతాయి.
గోళ్లలో ఏర్పడే పుండ్లు, పుచ్చులు లాంటిని గోరింటాకు నయం చేస్తుంది.
గోరింటాకుని రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నె ఉడికించి కషాయంగా చేసి బెణికిన చోట, చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డ భాగంలో పెట్టుకుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

Comments
Post a Comment