ప్రపంచంలో అత్యంత స్పీడ్ గా వెళ్లే బుల్లెట్ రైలు ఇది దీని వేగం గంటకు ఎంతో తెలుసా ..!అసలు దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ….!
written by Chandu
August 23, 2017
స్పీడ్ ట్రైన్ గంటకు 350 కి.మీ
ప్రపంచంలో అత్యంత స్పీడ్ గా వెళ్లే బుల్లెట్ రైలు సెప్టెంబరు 21న చైనాలో ప్రారంభం కానుంది. బీజింగ్, షాంఘై నగరాల మధ్య ప్రయాణాన్ని మరో గంట తగ్గించేందుకు వీలుగా సగటున 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడిచే రైళ్లను చైనా రైల్వే కార్పొరేషన్ నడపనుంది.
షాంఘై, బీజింగ్ నగరాల మధ్య 1,318 కిలోమీటర్ల దూరాన్ని కొత్తగా ప్రారంభించే రైలు కేవలం నాలుగు గంటల్లోనే చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య నడుస్తున్న రైళ్ల వేగం గంటకు సగటు వేగం 300 కిలోమీటర్లు. ఈ కొత్త రైళ్లు ప్రస్తుతం ఉన్న వాటి కంటే గంటకు 50 కిలోమీటర్లు అధిక వేగంతో నడుస్తాయి. అసాధారణ, అత్యవసర పరిస్థితుల్లో ఈ రైళ్లు తమంటత తామే స్పీడ్ ను కంట్రోల్ చేసుకుని నిలిచిపోతాయి.
ఈ రైళ్లు రోజుకు ఏడుసార్లు ప్రయాణిస్తాయి. కొత్తగా ప్రారంభించే ఫ్యూక్సింగ్ రైళ్ల గరిష్ట వేగం 400 కిలోమీటర్లు. షాంఘై, బీజింగ్ నగరాల మధ్య నడుస్తోన్న పాత రైళ్ల ద్వారా 6 గంటల్లో చేరుకుంటున్నారు. హైస్పీడ్ రైళ్లను 2008లో లాంఛనంగా ప్రారంభించిన చైనా …వీటి కోసం దేశవ్యాప్తంగా మూడు మార్గాలను నిర్మించింది. చైనా వ్యాప్తంగా రైళ్లను గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ రైళ్లను 2011 నుంచి నడుపుతోంది. సుమారు 22 వేల కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలో అతిపెద్ద హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌ను చైనా కలిగి ఉంది. ఇది ప్రపంచ హైస్పీడ్ రైల్వే వ్యవస్థలో 60 శాతం. అలాగే 1/ 3 వంతు రైళ్లను 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో రూపొందించినట్లు చైనా అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ హీ హౌవూ తెలిపింది.
Comments
Post a Comment