మొబైల్ ఫోన్స్ ఎందుకు పేలుతాయి?

మొబైల్ ఫోన్స్ ఎందుకు పేలుతాయి? పేలకుండా ఏం చేయాలో సింపుల్ టిప్స్..!!అందరికి తెలియజేయండి.












సింపుల్ టిప్స్

మొబైల్ ఫోన్ పేలిందని ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ భయపడుతున్న పరిస్థితి. అయితే అసలు మొబైల్స్ ఉన్న పళంగా ఒక్కసారిగా ఎందుకు పేలతాయి? అలా జరగకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు ఏం పాటించాలి? ఇప్పుడు చాలా మంది ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు. ప్రతి మొబైల్ లో బ్యాటరీ మొబైల్ ప్రొటెక్షన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఓవర్ హీట్ లేదా ఓవర్ ఛార్జింగ్ అవకుండా మొబైల్ ను కాపాడుతుంది. ఒకవేళ బ్యాటరీ మొబైల్ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఫెయిల్ అయితే మొబైల్ హీట్ అవడం లేదా పేలడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా మొబైల్ కు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆ మొబైల్ కు వచ్చిన వరిజినల్ ఛార్జర్ తోనే ఛార్జింగ్ పెట్టాలి. ఎందుకంటే..



ఇలా చేస్తే మొబైల్ పాడవకుండా బ్యాటరీ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఫోన్ పేలే అవకాశం కూడా చాలా తక్కువ. అలాగే ఎప్పుడూ కూడా డూప్లికేట్, చీప్ ఛార్జర్స్ ను వాడరాదు. రీసెంట్ గా రెడ్మి నోట్ 4 ఫోన్ పేలిన ఘటనలో ఇన్వెస్టిగేషన్ చేయగా వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే.. చీప్, డూప్లికేట్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టడం వల్లనే ఆ ప్రమాదం జరిగిందని సాంకేతిక నిపుణులు నిర్థారించారు. మరో ప్రధానమైన విషయం ఎప్పుడైనా మొబైల్ లో ఛార్జింగ్ మొత్తం అయిపోయి డెడ్ స్టేజ్ కి వచ్చే వరకు అలాగే వాడి జీరోకు లేదా 5-10 పర్సెంట్ లోపునకు వచ్చాక ఛార్జింగ్ పెట్టకూడదు. కనీసం 20-30 పర్సంట్ ఛార్జింగ్ ఉండగానే వెంటనే ఛార్జింగ్ చేయాలి. అలాగే 100 పర్సెంట్ ఛార్జింగ్ అయ్యేంతవరకు కూడా ఉంచకూడదు. మొబైల్ ను ఫ్రిడ్జ్ లో, దానిపైన అలాగే ఓవెన్ లో, దానిపైన పెట్టకూడదు. మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్లో మాట్లాడుతూ ఉండడం.. చాటింగ్ చేయడం, గేమ్స్ ఆడడం లాంటివి చేయకూడదు. ఫోన్ ఒకవైపు ఛార్జ్ అవుతూనే అప్లికేషన్స్ రన్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హీట్ కావడమో అందులోని భాగాలు దెబ్బదినడమో జరిగి పేలే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా మొబైల్ నీళ్లలో పడితే వెంటనే ఛార్జింగ్ పెట్టకూడదు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం ఈ జాగ్రత్తలను పాటించడం వలన మీ ఫోన్ పెలకుండా సేఫ్ గా ఉంటుంది. ఈ కనీస జాగ్రత్తలు లోపిస్తే మొబైల్ పేలి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు