మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్
“అలెక్జాండర్ విశ్వవిజేత కాదు, మన రాజు పురుషోత్తముడి చేతిలో ఓడిపోయాడు” మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్ విజయగాథల మీద ఆధారపడి నిర్మితమైన సంస్కృతి అసాధారణ ఫలితాలనిస్తుంది, అది మహోన్నత చరిత్రను సృష్టిస్తుంది. అయితే నేటి విద్యార్థులకు మనం ఎలాంటి చరిత్రను చెబుతున్నాం. మనదైన చరిత్రపై వారికి అవగాహన లేదు. వ్యాపారం పేరుతో వచ్చి, మోసంతో మన దేశాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు మనదైన ప్రతి వ్యవస్థనీ నాశనం చేశారు. మన చరిత్రనీ వక్రీకరించారు. మనది పరాక్రమ చరిత్ర కాదు, పరాజయ చరిత్రే అని అసత్యాలను వ్యాపింపజేశారు. బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత కూడా ఆ చరిత్ర పాఠాలనే కొనసాగిస్తూ వచ్చారు. మరి మనలో స్వాభిమానం ఎలా నెలకొంటుంది? గర్వదాయకమైన మన వీరుల చరిత్రను పిల్లలకి పాఠాలుగా బోధించినపుడే మన సమాజంలో “చరిత్రను సృష్టించే వీరులు” తయారవుతారు. శివాజీకి జిజియామాత బాల్యంలోనే రామాయణ, మహాభారత గాధలు, చరిత్రలోని స్ఫూర్తివంతమైన కథలు చెప్పింది కాబట్టే ఆయన అంత గొప్ప వాడయ్యాడు. మన విద్యార్థుల్లో దేశభక్తి పెంచే విధంగా చరిత్ర రచన కొనసాగాలి. మనదేశ చరిత్రని గమన...
Comments
Post a Comment