పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Books And Health Go Hand-In-Hand)






కొంతమంది వ్యక్తులు వారి ఇంటిలో వేలకొద్ది పుస్తకాలను పెట్టుకుని, తరచూ ఏదో ఒకటి చదువుతూ ఉంటారు, అయితే మరికొంతమందికి ఒకటి లేదా రెండు పేజీల చదివితేనే నిద్ర వస్తుంది. మీరు రెండవ వర్గానికి చెందినట్లయితే, మీరు పలు ప్రయోజనాలను కోల్పోతున్నట్లు దయచేసి గమనించండి. అవును, మీకు స్పష్టంగా చెబుతాము వినండి – ఈ సందర్భంలో చదవడం అంటే నిజమైన పుస్తకాలు, మ్యాగజైన్‌లు, ఇబుక్‌లు లేదా వార్తాపత్రికలు చదవడం అని అర్థం, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లను చదవడం కాదు! మేము చదవడం వలన కలిగే ప్రయోజనాలు మేము దిగువన పేర్కొన్నాము, వీటిని చదవడం వలన మీరు తక్షణమే మంచి పుస్తకాన్ని చదవడం ప్రారంభించడానికి కావల్సిన ఉత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాను....


మీ మెదడు వికసిస్తుంది (Stimulates your mind):
చదవడం వలన మీ మెదడు వికసిస్తుందని పెద్దలు చెబుతారు. చదవడం వలన మీ మనస్సు ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ మెదడును పేజీలోని పదాలను చదవడానికి మాత్రమే కాకుండా, చదివిన అంశాలను ఊహించుకుంటారు మరియు ఒక నిర్ధారణకు వస్తారు. చదవడం వలన అల్జీమర్స్ వ్యాధి సోకకుండా నివారించడానికి పరోక్షకంగా సహాయపడుతుంది మరియు చిత్తవైకల్యం కూడా సంభవించదు.


జ్ఞాపక శక్తి పెరుగుతుంది (Improves memory):
మీరు ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, ప్రతి పేజీ తిప్పుతున్నప్పుడు మీరు ముందు పేజీలోని అంశాన్ని కొనసాగింపు కోసం గుర్తు ఉంచుకుంటారు. దీని వలన మీరు కథను అర్థం చేసుకోగలరు మరియు మనస్సులో ప్రతి పాత్రను చిత్రీకరించుకోగలరు. అయితే దీని వలన మీ జ్ఞాపక శక్తి మెరుగువుతుందని చాలా తక్కువ మందికి తెలుసు మరియు మెదడులో కొత్త విధానాలు లేదా నాడికణాల మధ్య సంధులు ఏర్పడతాయి. చదవడం వలన ఇప్పటికే ఉన్న జ్ఞాపకాలు బలపడతాయి, దీని వలన తక్కువ సమయంలోనే పురాతన అంశాలను సులభంగా జ్ఞాపకానికి వస్తాయి.


విసుగు తగ్గుతుంది (Reduces boredom):
చదవడం అనేది ఒక రకమైన ప్రేరణ మరియు దీని వలన విసుగు తగ్గుతుంది. ఎలాంటి శారీరక కదలికలు లేకుండా, మీరు తిప్పే ప్రతి పేజీతోపాటు దానిలో దృశ్యాలను, పాత్రలను, ముఖాలను మార్చుతూ ఉంటారు మరియు దీని వలన మీ దృష్టి దీనిపై కేంద్రీకరించబడుతుంది. చదవడం వలన మీకు గతంలో లేని పలు కొత్త ఆలోచనలు, అభిరుచులు మరియు అంశాలు అవగతంలోకి వస్తాయి.


మంచి నిద్ర సాధ్యమవుతుంది (Helps you sleep better):
మంచి పుస్తకాన్ని చదవడం వలన మీరు ప్రశాంతంగా నిద్ర పోవడానికి సహాయపడుతుంది. దీని వలన మీరు ఆ రోజు జరిగిన సంఘటనలను మరిచిపోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది, ఈ కారణంగా మీరు నిద్రపోవడానికి ప్రయత్నించినప్పుడు మీకు అంతరాయం కలిగించే ఆలోచనల సంఖ్య తగ్గుతుంది. దీని వలన మీ నిద్రకు ఎక్కువగా అంతరాయం కలిగించే ట్యాబ్లెట్‌లు మరియు ఫోన్‌లు వంటి వాటికి మీరు దూరంగా ఉండగలరు. అయితే, మీరు ఒక ఆసక్తికరమైన పుస్తకం చదువుతూ రాత్రి పూర్తిగా మేల్కొని ఉన్నట్లయితే, సమస్యలు రావచ్చు.

మీరు ఉత్తమంగా సంభాషించడానికి సహాయపడుతుంది (Helps you communicate better):
చదవడం వలన మీ జ్ఞానం మరియు జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఇది మీరు చదివే లేదా సంభాషించాలనుకునే భాష యొక్క స్వల్ప బేధాలు గురించి మరింత తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది. చదవడం వలన మీరు మనస్సులోని మాటను అందంగా చెప్పడానికి సహాయపడుతుంది, దీని వలన మీరు సహజంగా ఇతరులతో సమర్థవంతంగా సంభాషించగలరు మరియు మీరు ఆమోదించలేని అభిప్రాయాలను కూడా ఆమోదించగలరు.

ప్రముఖ అమెరికన్ రచయిత డా. సీయుస్ ఈ విధంగా చెప్పారు, “మీరు ఎక్కువ పుస్తకాలను చదవడం వలన, ఎక్కువ విషయాలను తెలుసుకోగలుగుతారు. మీరు ఎక్కువ విషయాలను తెలుసుకోవడం వలన, ఎక్కువ ప్రాంతాలను సందర్శించగలరు!”

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్