billgates
బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలియని కొన్ని అక్షర సత్యాలు అవేంటో తెలుసా….!
ప్రతి ఇంట్లో, ఓ కంప్యూటర్ ఉండాలని సంకల్పించిన వారిలో బిల్ గేట్స్ ఒకరు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి.
ఈ కంప్యూటర్ యూగకర్తకు ఉన్న క్రియేటివ్ పరిజ్ఞానం ఐటీ పరిశ్రమలో చాలా కొద్ది మందికే ఉందని చెప్పొచ్చు. ప్రపంచం మొత్తం కంప్యూటింగ్ పై నడుస్తోందంటే అందుకు కారణం గేట్స్ లాంటి మహానుభావులే. ప్రపంచాన్ని కంప్యూటింగ్ వైపు పరుగులెత్తించిన బిల్ గేట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..
విదేశీ భాషల పై పట్టు లేదు.. బిల్ గేట్స్‌కు విదేశీ భాషల పై ఏమాత్రం అవగాహన లేదు. అయినప్పటికి ఆయన సేవాతత్పురత ముందు ప్రపంచం దాసోహమనకు తప్పదు.
తరగని సంపద ఉన్నప్పటికి.. బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్‌లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువ ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో 1977లో అరెస్ట్ అయ్యారు.
బిల్ గేట్స్ కూడా డ్రాప్ కాలేజీ డ్రాప్ అవుటే. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్ యూనివర్శిటీని విడిచారు.
ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో .. బిల్‌గేట్స్ ఫోర్బ్స్ ప్రపంచ ధనికుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 7,500 కోట్ల డాలర్ల సంపదతో గేట్స్ ఈ ఏడాది కూడా టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. అయితే వరసగా మూడేళ్ల నుంచి గేట్స్ ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో తొలి స్థానంలో కొనసాగుతున్నారు.
రోజుకు 60 కోట్లు చప్పున ఖర్చుచేసినట్లయితే ఏకంగా ఆ ఆస్తి తరగటానికి 220 సంవత్సరాలు పడుతుందని ద గార్డియన్ మీడియాలో ప్రచురితమైన ఆక్స్‌ఫామ్ సర్వే చెబుతోంది.
బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్. బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్లను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.
ఓ అంచనా ప్రకారం అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.
బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు. అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు. మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.
బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.

Comments
Post a Comment