birthday cakes dangerous
కేకులు ఇంత డేంజరా…
పుట్టినరోజులకు కేకు కోసి పంచిపెట్టుకుని ఆనందాలను పంచుకోవడం మనకో సంస్కృతిగా మారింది. కేకుమీద కొవ్వొత్తులను వెలిగించి వాటిని ఊది ఆర్పడం అంత ఆరోగ్యదాయకం కాదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ముఖ్యంగా కేకుమీద కొవ్వొత్తులను ఊదడం ద్వారా ,నోటినుంచి లాలాజలం ఎంతోకొంత తుంపరగా కేకుమీద పడుతుంది.సాధారణంగా నోటిలోని లాలాజలంలో బాక్టీరియా ఎక్కువగానే వుంటుంది.
ఇదికేకు మీద అలంకరించే ఐసింగ్ పొర మీద పడగానే బాక్టీరియా పెరిగిపోతుందని దక్షిణ కరోలినాలోని క్లెమ్సన్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.నోటి నుంటి వెలువడే బాక్టీరియా ఐసింగ్ పొర మీద పడగానే బాక్టీరియా 14 రెట్లు పెరుగుతుందట,ఇది ఆరోగ్యానికి హాని కలిగించదని,అయితే పుట్టిన రోజు జరుపుకునే పిల్లలు అనారోగ్యంతో వుండి కేకుమీద కొవ్వొత్తులను ఊదే పని చేస్తే మాత్రం ఇతరులకు సమస్యేనని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

Comments
Post a Comment