longest bridge
ప్రపంచంలోనే అతి పెద్ద బ్రిడ్జి…..
స్విట్జర్లాండ్ అనగానే మంచు టోపీలు పెట్టుకున్న పర్వతాలు,నోరూరించే స్విస్ చాక్లెట్లు గుర్తుకు వస్తాయి. మన భారతీయులకు బడాబాబులు నల్లధనం దాచుకునే స్విస్ బ్యాంనకు కూడా గుర్తుకు వస్తుంది.ఎన్నో వింతలు విశేషాలకు నెలవైన స్విట్జర్లాండ్,మరో అరుదైన ఘనత దక్కించుకుంది.
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 494 మీటర్లు పొడవుతో గాలిలో వ్రేలాడే బ్రిడ్జి కేవలం స్విట్జర్లాండ్ లో మాత్రమే వుంది.పర్వతాల మధ్య,పృకృతి సౌందర్యంలో ఉన్న ఈ బ్రిడ్జి మీద నడక అంత తేలికయిన విషయం కాదు.ఊపిరి బిగపట్టి నడవాల్సిందే.ఎందుకంటే నడకకు ఈ బ్రిడ్జి కదులుతుంది.ఎక్కడా భూమినుంచి వేసిన స్థంభాల మీద ఇది లేదు.గుండె నిబ్బరంలేని వాళ్ళు దీనిపై నడవకపోవడం మంచిది. జెర్నట్ టూరిజం బోర్డు వెబ్ సైట్ వెల్లడించిన ప్రకారం ఈ యూరోపా బ్రుకే బ్రిడ్జి గ్రిచిన్, జెర్మట్‌లను కలుపుతుంది.స్విట్జర్లాండ్ లోని 4వేల ఐదువందల నలభైఐదు మీటర్లున్న అత్యంత ఎత్తయిన డోంపర్వతాన్ని కూడా ఈ బ్రిడ్జిమీద నుంచి వీక్షించవచ్చు.ఈ బ్రిడ్జి సమాంతరంగా కాకుండా ఎగుడు దిగుడుగా వుండడం విశేషం.సముద్ర మట్టానికి 1,600మీటర్లు,2,200మీటర్ల ఎత్తులో దారి వుంటుంది. 2010లో కొండచరియలు విరిగిపడి ఇలాంటి బ్రిడ్జి ధ్వంసం అవడంతో యూరోపా బ్రుకే బ్రిడ్జిని నిర్మించారట. స్విస్ రోప్ సంస్థ దీనిని కేవం 10వారాలలోనే నిర్మించిది.త్రాళ్ళతోను, కేబుల్‌తోను ఈ బ్రిడ్జి కుదుపులను అదుపుచేసే విధంగా దీనిని రూపొందించారు.2అడుగుల వెడల్పు,8టన్నులు బరువున్న యూరోపా బ్రుకే బ్రిడ్జి ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిడ్జి.
Comments
Post a Comment