New Indian currency note 200/-


ఇదే మన క్రొత్త 200రూపాయల నోటు…….
   


ఆగస్టు 27నుంచి క్రొత్త 200 రూపాయల నోటు మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు ఆర్‌బిఐ తెలిపింది.పసుపు నారింజ రంగుల మిశ్రమంలో వుండే ఈ క్రొత్త నోటు వివరాలను ఆర్ఖికమంత్రిత్వ శాఖ వెల్లడించింది.ముందు భాగంలో మహాత్మగాంధి బొమ్మ కలిగిన ఈ నోటులో అశోక చక్రం ఆంగ్ల H అక్షరంలో 200 సంఖ్యతో ,146mm పొడవు,66mm వెడల్పుకలిగి వుంటుందని వెల్లడించింది.మహాత్మాగాంధి బొమ్మ మధ్యలో వుండి,200 సంఖ్య మరియు దేవనాగరి లిపిలో 200 సంఖ్య నోటులో ఇమిడీకృతం అయివుంటాయి. RBI,भारत,India,200 అనేవి సూక్ష్మరూపంలో ప్రింటయివుంటాయి.నోటు లో ఆకుపచ్చ,నీలం రంగులో ఒక సన్నని దారం కలపబడివుంటుంది.దానిమీద 200 సంఖ్య సూక్ష్మరూపంలో ముద్రించబడివుంటుంది.నంబరు ప్యానెల్‌లో ఆరోహణ క్రమంలో సంఖ్యలుంటాయి.ఇవి పైన ఎడమభాగంలో,నోటుకు క్రింద కుడిభాగంలో వుంటాయి.నోటుకు వెనుక భాగంలోని ఎడమభాగంలో ఏ సంవత్సరంలో ముద్రించినదో ఆ సంవత్సరం వుంటుంది.ఎడమ భాగంలోనే క్రింద స్వఛ్ఛభారత్ లోగోతో పాటు క్యాప్షన్ వుంటుంది.లాంగ్వేజ్ ప్యానెల్ తోపాటు సంచీస్తూప నిర్మాణం ముద్రించబడివుంటుంది.కుడి ఎగువన 200 సంఖ్య దేవనాగరి లిపిలో ముద్రించబడివుంటుంది.

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు