POLYNDROME NUMBERS


గణితంలో “వికటకవి” లు

ఎటు నుండి చదివినా ఒకటే

ఇంగ్లీష్ లో పాలిండ్రోమ్స్ (palindromes) అనే పదం వినే ఉంటారు కదా!

పాలిండ్రోమ్స్ అంటే ఎటునుండి చూసినా ఒకే రకంగా ఉండే పదాలు: తెలుగులో కిటికీ, మందారదామం, వికటకవి… ఇలాంటివి. ఇంగ్లీష్ లో radar, rotator, madam, … లాంటివి. మరి సంఖ్యల్లో అలాంటివి ఉన్నాయా?

కొన్ని చెప్పండి చూద్దాం. 11; 22;… 121,131, 141…..212, 222,232,…… బోలెడన్ని… వాటికి సంబంధించిన ఒక అమరిక (pattern) కింద చూడండి.

11 = 11

11×11 = 121

11×11×11= 1331

11×11×11×11= 14641….

11  యొక్క 4 ఘాతం వరకు ఇలా వస్తాయి. అలాగే మరొకటి చూడండి



11 x 11 = 121

111 x 111 = 12321

1111 x 1111 = 1234321

11111 x 11111 = 123454321

దీనిని ఇంకా కొనసాగించ వచ్చు.


పాలిండ్రోమ్స్ ప్రధాన సంఖ్య అయినా కావచ్చు, లేదా సంయుక్త సంఖ్య అయినా కావచ్చు. మొదటి పాలిండ్రోమ్ అయ్యే ప్రధాన సంఖ్య ఏది ? 11 . అంతే కాదు రెండంకెల పాలిండ్రోమ్ ప్రధాన సంఖ్య ఇదొక్కటే.

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు