ATM మిషన్ ఎలా పనిచేస్తుందో చాలా మందికి తెలియదు కనీసం మీరైనా తెలుసుకోండి....

ATM మిషన్ ఎలా పనిచేస్తుందో చాలా మందికి తెలియదు కనీసం మీరైనా తెలుసుకోండి....

VADDEPALLYCHANDU.BLOGSPOT.COM

ఏటీఎం మిషన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా?

మనకు డబ్బులు అవసరమైతే ఏటీఎం ద్వారా డ్రా చేసుకుంటాం. ఏటీఎంలో మనం చేసే పని ఏమిటంటే… మిషన్ లో కార్డు పెట్టిమా… పిన్ ఎంటర్ చేశామా… డబ్బులు తీసుకున్నామా! అంతే బయటకు వచ్చేస్తాం. అసలు ఏటీఎం అంత ఖచ్చితంగా ఎలా పనిచేస్తుంది. మనం అడిగిన మొత్తాన్ని ఎక్కువా కాకుండా, అలాగని తక్కువా కాకుండా ఎలా ఇస్తుంది? ఈ విషయాల్ని తెలుసుకోవాలని ఆశక్తి మీ ఉందా? అయితే ఇది చదవాల్సిందే….

* ఏటీఎం కార్డుకు ఉండే మెగ్నెటిక్ స్ట్రిప్ ద్వారా సమాచారం మొత్తం బ్యాంక్ సర్వర్‌ కు అందుతుంది.
* అన్నీ సక్రమంగా ఉంటే ఆ సమాచారం తిరిగి ఏటీఎంలోని కంప్యూటర్‌కు చేరుతుంది.
* పిన్ ఎంటర్ చేసిన తర్వాత కూడా వెరిఫికేషన్ ప్రోసెస్ నడుస్తుంది.
* మీరు విత్‌ డ్రా చేయాల్సిన మొత్తాన్ని టైప్ చేయగానే.. ఏటీఎంలోని క్యాష్‌బాక్స్‌ల వద్ద హడావుడి మొదలవుతుంది.
ఉన్న క్యాష్‌బాక్స్‌ ల చివరలో ఉన్న మూత తెరుచుకుంటాయి.
* లైట్ సెన్సర్లు నోట్ల విలువను గుర్తిస్తే.. క్యాష్‌బాక్స్‌కు అనుసంధానమైన యంత్రాలు (సక్షన్ మెషీన్స్) అవసరమైనన్ని నోట్లను బయటకు తీస్తాయి.
* నకిలీ, నలిగిపోయిన నోట్లు వస్తే… వాటిని ప్రత్యేకమైన బాక్స్ (రిజెక్ట్ బాక్స్)లోకి పడేసి మళ్లీ క్యాష్‌బాక్స్ నుంచి నోట్లు వెలికితీస్తాయి. కావాల్సిన మొత్తం అందేవరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
*క్యాష్‌బాక్స్‌ల పై భాగంలో ఏర్పాటు చేసిన రోలర్ల మధ్య నుంచి నోట్లు ఏటీఎంలో మనం క్యాష్ తీసుకునే చోటికి వస్తాయి.

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు