స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి?
దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ టెర్రర్ అసలు స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి? లక్షణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ టెర్రర్
ప్రాణాంతక మహమ్మారి స్వైన్ ఫ్లూ వ్యాధి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ప్రతిరోజూ ఈ వ్యాధి బారినపడి చాలా మంది మంచానపడుతున్నారు. దీంతో చాలామంది ఏ కాస్త జ్వరం, జలుబు వచ్చినా అవి స్వైన్ ఫ్లూ లక్షణాలేమోనని తీవ్రంగా ఆందోళన చెందుతూ, ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
స్వైన్ ఫ్లూ అనేది ప్రధానంగా ఫ్లూ సోకిన పశువుల(పంది) మాంసం తినడం వలన మొదలైందని ఒక సమాచారం. ఈ వైరస్ ను H1N1 ఇన్ ఫ్యూయెంజా అంటారు. కామన్ గా స్వైన్ ఫ్లూ అని సంబోధిస్తారు.
స్వైన్ ఫ్లూ లక్షణాలు
మొదట సాధారణ జలుబులాగానే కనపడుతుంది. కానీ ఆరు రోజుల తర్వాత ఆయాస పడటం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవటం, జ్వరం రావడం రావచ్చు. వీటితోపాటు కొంతమందికి ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు.. లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్ ఫ్లూగా భావించి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, తగిన వైద్యాన్ని అందించాల్సి ఉంటుంది.
ఫ్లూ సీజన్ లో జ్వరం రావటం, మందులు వాడినా, వాడకపోయినా ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోవటం సహజమే. చిన్నపిల్లల విషయంలో… జ్వరం తగ్గిపోయిన వెంటనే పిల్లలను పాఠశాలలకు పంపకుండా ఒక రోజంతా ఇంట్లోనే పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా చేయాలి.
చాలా మంది వ్యక్తులు కొద్దిపాటి తీవ్రత ఉన్న లక్షణాలనే అనుభవించినప్పటికీ, కొంతమంది మాత్రం చాలా ఎక్కువ తీవ్రతతో ఉన్న లక్షణాలను చూపించారు. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, కండరాలు లేదా కీళ్ళ నొప్పులు, వాంతి వచ్చినట్టు ఉండటం, విరేచనాలు వంటివి కొద్దిపాటి తీవ్రత ఉన్న లక్షణాలు.
ఈ లక్షణాలను కలిగి ఉన్నవారు తీవ్రమైన వ్యాధి బారిన పడతారు:
ఉబ్బసం ఉన్నవారు, చక్కెర వ్యాధిగ్రస్తులు, అధిక బరువు ఉన్నవారు, గుండె జబ్బు ఉన్నవారు, రోగ నిరోధక శక్తి లేనివారు, నరాల అభివృద్ధి స్థితులు ఉన్న పిల్లలు, గర్భిణీలు
వ్యాపించకుండా తీసుకోవాలసిన జాగ్రత్తలు:
చిన్నారులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పడు తప్పకుండా టిష్యూ పేపర్లను అడ్డు పెట్టుకోవాలని చెప్పాలి. అలాగే ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్ ను ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడవేయకుండా.. వెంటనే వాటిని చెత్తబుట్టలో పారవేయమని చెప్పాలి. అంతేగాకుండా, పిల్లలు తుమ్మిన ప్రతిసారీ వారి చేతులను శుభ్రం చేయడం మంచిది.
ఇక చివరిగా.. చిన్నారులకు ముందుగానే సీజనల్ ఫ్లూ నివారణ వ్యాక్సిన్లను వేయించటం ఉత్తమం. అలాగే స్వైన్ ఫ్లూ నివారణా వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ వ్యాక్సిన్ పిల్లలకు ఎలా వాడాలంటే..
మొత్తంమీద రెండు డోసుల వ్యాక్సిన్ అవసరమవుతుంది. మొదటి డోసు తర్వాత మూడు వారాల వ్యవధితో మరో డోసు ఇప్పించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇచ్చాక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ దాడిని ఎదుర్కొనేందుకు శరీరం పూర్తిగా సన్నద్ధం కావాలంటే మరో రెండు వారాల సమయం
ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
దీనిని తప్పించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, వీలైనన్ని సార్లు చేతులు కడుగుకోవడం తప్ప వేరే మార్గం లేదు..
ప్రతి ఇంట్లోనూ ఉండే తులసి ఆకులు ఉదయాన్నే నోటిలో వేసుకుని నమిలితే కొంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అడుగు పొడవున్న తిప్పతీగను తీసుకుని ఐదారు తులసి ఆకులతో కలిపి నీటిలో 20 నిమిషాలు మరిగించి రుచి కోసం నల్ల మిరియాలు, సైంధవ లవణం, రాతి ఉప్పు, పటిక బెల్లం కలుపుకుని గోరువెచ్చగా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు గోరువెచ్చటి నీటితో తిన్నా ప్రయోజనముంటుంది. గోరువెచ్చటి పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే కొంత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒకసారి స్వైన్ ఫ్లూ సోకినట్టు అనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
పైన తెలిపినవన్నీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే… మనది ఉష్ణ దేశం కాబట్టి కొన్ని రోజులలో వాతావరణంలో మార్పులు వచ్చి వ్యాధి తగ్గు ముఖం పట్టొచ్చు… ప్రతి జలుబు స్వైన్ ఫ్లూ కాదు.. కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
వీలైనంత వరకు షేక్ హ్యాండ్ లు తగ్గించి.. మన భారతీయ సంస్కృతి ప్రకారం రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడం అలవాటు చేసుకోండి.. ఏ వ్యాధులు సంక్రమించవు.

Comments
Post a Comment