రాత్రి పూట గోళ్లను కత్తిరించవద్దంటారు… ఎందుకో తెలుసా..?
రాత్రి పూట గోళ్లను కత్తిరించవద్దంటారు… ఎందుకో తెలుసా..?
VADDEPALLYCHANDU.BLOGSPOT.COM
మన శరీరంలో జీవం లేకున్నా పెరిగే వాటిలో గోళ్లు, వెంట్రుకలు ముఖ్యమైనవి. వెంట్రుకలనైతే పార్లర్‌కో, సెలూన్‌కో వెళ్లి కట్ చేయించుకుంటాం. అదే గోర్లనైతే దాదాపుగా ఇంట్లోనే తీసుకుంటాం. అయితే కొందరు గోర్లను స్టైల్, లుక్ కోసం పెంచుకుంటారు లెండి. అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు మేం చెప్పబోతున్నది మాత్రం గోళ్లను కట్ చేయడం గురించి. అవును, అదే. కొందరైతే చాలా చిన్నగా వచ్చే వరకు గోళ్లను కట్ చేస్తారు. కొందరు చాలా వరకు పెంచి కట్ చేస్తారు. ఇంకా కొందరు ఎప్పటికప్పుడు గోళ్లను కట్ చేసుకునే పనిలోనే ఉంటారు. అయితే ఎలా కట్ చేసినా గోళ్లను పగటిపూటే కట్ చేయాలట… రాత్రి పూట కట్ చేయకూడదట… అది ఎందుకంటే..!
గోళ్లను రాత్రి పూట కత్తిరించకూడదనే మాటకు రెండు కారణాలను ప్రధానంగా మనం చెప్పవచ్చు. అందులో ఒకటి ఏమిటంటే… వెనుకటికి గోళ్లను కట్ చేసుకునేందుకు ఎక్కువగా బ్లేడ్లను లేదా కత్తెరలను వాడేవారు. ఈ క్రమంలో ఆ సమయంలో రాత్రి పూట కరెంట్ కూడా సరిగ్గా ఉండేది కాదు. దీంతో రాత్రి పూట చీకటిలో గోర్లను బ్లేడు, కత్తెరతో కట్ చేయడం వేళ్లకు ప్రమాదకరం. కనుకే అప్పట్లో అనేవారు, రాత్రి పూట గోర్లను కత్తిరించకూడదని. అది అలా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.
ఇక గోర్లను రాత్రి పూట కత్తిరించకూడదనే మాటకు మరో కారణం ఏమిటంటే… రాత్రి పూట ఎక్కువగా మంత్రగాళ్లు తిరుగుతారు. కాబట్టి ఆ సమయంలో గోర్లను కట్ చేస్తే వాటిని వారు మనకు తెలియకుండా తీసుకుపోయి దాంతో క్షుద్రపూజలు చేసి మనకు కీడు కలిగించే అవకాశం ఉంది. కనుకే గోర్లను రాత్రి పూట కత్తిరించవద్దని చెబుతున్నారు. అయితే గోర్లను రాత్రి పూట కత్తిరించవద్దనే దానికి కారణాలు ఎలా ఉన్నా మాత్రం ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా గోళ్లను కత్తిరించాల్సిందే. లేదంటే అనారోగ్యాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా..!
Comments
Post a Comment