దసరా నవరాత్రులు,దుర్గా మాత యొక్క ఆయుధాల ప్రాముఖ్యత
నేటి నుంచి దేవీ నవరాత్రోత్సవాలు
నవరాత్రులలో తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. స్థలసంప్రదాయాన్ని బట్టి దేవతల రూపాలు మారుతూ ఉంటాయి.
1.భద్రకాళి
2.అంబ లేదా జగదంబ, విశ్వానికి మాత
3.అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లి (పూర్ణ: వైయక్తికంగా ఉపయోగిస్తారు)
4.సర్వమంగళ, అందరికీ (సర్వ) మంచి (మంగళ) చేకూర్చే తల్లి
5.భైరవి
6.చంద్రిక లేదా చండి
7.లలిత
8.భవాని
9.మూకాంబిక
ఆచారకర్మలు :
చంద్రమాసమయిన అశ్విన మాసంలోని ప్రకాశవంతమయిన పక్షంలోని మొదటి రోజున (ప్రతిపాదం) నవరాత్రులు మొదలవుతాయి. అక్టోబరు మాసం మొదలయినపుడు ప్రతి సంవత్సరం తొమ్మిది రాత్రులు ఈ పండుగను జరుపుకుంటారు; చంద్ర పంచాంగం ప్రకారం తేదీలను నిర్ణయించినా కూడా ఈ పండుగను ఒక రోజు అటూ ఇటూగా జరుపుకోవచ్చు.
నవరాత్రులను వివిధ పధ్ధతులతో దేశమంతా ఉత్సవంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మూడు నవరాత్రులనూ అత్యంత ఆదరణతో, తొమ్మిది రోజులూ ఉపవాసం ఉంటూ, దేవీ మాతను వివిధ రూపాలలో పూజిస్తూ జరుపుకుంటారు. చైత్ర మాసంలో జరుపుకునే నవరాత్రి శ్రీ రామ నవమితోనూ, శరద్ నవరాత్రి దుర్గా పూజతోనూ, దసరాతోనూ పరాకాష్ఠకు చేరుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ దసరా ఉత్తర భారతదేశంలో ప్రత్యేకించి చాలా ప్రఖ్యాతి గాంచింది.
తూర్పు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజగా జరుపుకునే ఉత్సవంలో, చివరి నాలుగు రోజులూ ప్రత్యేకమైన నాటకీయ రూపం సంతరించుకుంటాయి. రాష్ట్రంలో ఇది అన్నింటికన్న పెద్ద ఉత్సవం. అద్భుతమైన కళానైపుణ్యంతో, అలంకరించబడిన బంక మన్నుతో చేయబడిన నిలువెత్తు దుర్గాదేవి విగ్రహాలు, ఆమె మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో గుళ్ళలోనూ ఇతర ప్రదేశాలలోనూ ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహాలకు అయిదు రోజులు పూజలు నిర్వహించి, అయిదో రోజున నదిలో నిమజ్జనం చేస్తారు.
పశ్చిమ భారతదేశంలో, ప్రత్యేకించి గుజరాత్ రాష్ట్రంలో, నవరాత్రి ప్రఖ్యాతి గాంచిన గార్బా మరియు డాండియా-రాస్ నృత్యాలతో వేడుకగా జరుపుకుంటారు. గత కొద్ది సంవత్సరాలుగా, గుజరాత్‌లో గుజరాత్ ప్రభుత్వం "నవరాత్రి పండుగ ఉత్సవాలను" నవరాత్రి పండుగ యొక్క తొమ్మిది రోజులలో క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో పాలు పంచుకోవడానికి గుజరాత్ నలుమూలల నుండి, ఇంకా విదేశాల నుండి కూడా ప్రజలు తరలి వస్తారు. ఇది భారతదేశమంతా కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది, ఇంకా ప్రపంచవ్యాప్తంగా, UK మరియు USAలతో సహా అన్ని దేశాలలో కూడా ఇది చాలా జనాకర్షకమైన ఉత్సవం.
గోవాలో, జాత్ర నవరాత్రి అపుడు మొదలవుతుంది, అంత్రుజ్ (పోండా) మొత్తం కూడా చాలా వైభవంగా అలంకరిస్తారు. సరస్వత్ ఆలయాలను అందంగా అలంకరించి, విగ్రహాలను పూజకు బయటకు తీస్తారు. విగ్రహాలకు దుస్తులు తొడిగి పూలు, గంధం, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. భక్తులు నవరాత్రి పండుగలో ప్రత్యేక దర్శనానికి వస్తారు, భక్తుడు ఎక్కువగా ఎదురు చూసేది కౌల్ ప్రసాదము, అది దేవుళ్ళు దేవతల నుండి ఇచ్చిన ప్రసాదంగా భావిస్తారు. దేవీ విగ్రహాలను పూలతో ప్రకాశవంతమైన రంగులతో అలంకరిస్తారు, భక్తులు లేదా పూజారులు పూలను మార్చే పని కూడా చేయకుండా పూజిస్తారు. ఉత్సవపు రాత్రి పూర్తి అయినపుడు, పూలను ప్రసాదంగా భక్తులకు పంచి పెడతారు.
దక్షిణ భారతదేశంలో, వేదికలు నిర్మించి, విగ్రహాలను వాటి పై ఉంచుతారు. దీనిని గోలు అంటారు.
కేరళలో, మూడు రోజులు: నవరాత్రి యొక్క అష్టమి, నవమి మరియు విజయ దశమి రోజులను సరస్వతీ పూజగా జరుపుకుంటారు అందులో, పుస్తకాలకు పూజ నిర్వహిస్తారు. పుస్తకాలను పూజ కోసం అష్టమి రోజున తమ సొంత ఇళ్ళలోనూ, సంప్రదాయికమైన చంటిపిల్లల బడులలోనూ, ఆలయాలలోనూ ఉంచుతారు. సరస్వతిని పూజించాక, విజయ దశమి రోజున పుస్తకాలను సంప్రదాయబధ్ధంగా చదవడానికీ, రాయడానికీ బయటికి తీస్తారు. విజయదశమి ని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు, దానిని విద్యారంభం అంటారు. కేరళలో ఈ రోజు కొన్ని వేలమంది చంటిపిల్లలను అక్షరాల ప్రపంచంలోకి ఆవాహన చేస్తారు.
మూడు వివిధ అంశాల మహోన్నతమైన దేవినీ లేదా దేవతలనూ ఆరాధించడానికి నవరాత్రిని మూడు రోజుల సమూహంగా విభజిస్తారు.
మొదటి మూడు రోజులు
దేవిని మనలో ఉన్న అశుధ్ధాలను నాశనం చేయడం కోసం, ఒక ఆధ్యాత్మిక శక్తిగా వేరు చేస్తారు, ఆ శక్తిని దుర్గ అనీ, కాళి అనీ గుర్తిస్తారు.
రెండవ మూడు రోజులు
మాతను ఆధ్యాత్మిక సంపదను ఒసగే లక్ష్మీ మాతగా ఆరాధిస్తారు. లక్ష్మీ మాత సంపదకు దేవత, ఆమెను తన భక్తులకు తరిగిపోని సంపదను ఇచ్చే శక్తిగల దేవతగా భావిస్తారు.
చివరి మూడు రోజులు
చివరి మూడు రోజులను చదువుల తల్లి అయిన సరస్వతిని పూజించడంలో గడుపుతారు. జీవితంలో అన్ని రంగాలలోనూ విజయం సాధించడానికి, ఆస్తికులు మూడు రకాల దైవిక స్త్రీత్వం యొక్క ఆశీర్వాదం పొందడం కోసం పూజిస్తారు, అందుకే తొమ్మిది రాత్రుల పూజ చేస్తారు.
సంప్రదాయబధ్ధంగా ఎనిమిదవ రోజు దుర్గాష్టమి చేస్తారు, అది బెంగాల్‌లో చాలా ముఖ్యమైన రోజు.
దక్షిణ భారతదేశంలోని కొన్ని భాగాలలో, సరస్వతి పూజ తొమ్మిదవ రోజు జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని చాలా భాగాలలో మహానవమి (తొమ్మిదవ) రోజున ఆయుధపూజ చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, అన్నిరకాల పరికరాలు, ఉపకరాలు, యంత్రాలు మరియు స్వయంచాలిత ఉపకరాలను అలంకరించి, దేవీ పూజతో పాటు వాటిని కూడా పూజిస్తారు. మరుసటి రోజు నుండి పని తిరిగి తాజాగా మొదలవుతుంది, అంటే పదవరోజు, దానిని 'విజయదశమి'గా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని చాలా మంది అధ్యాపకులు/విద్యాలయాలు ఆరు సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లలకు పాథాలు నేర్పే పాఠశాలలలో ఆ రోజు నుండి పిల్లలకు పాఠాలు నేర్పడం మొదలెడతారు.
ఉత్తర భారతదేశంలో రామ్‌లీల యొక్క పరాకాష్ఠను దసరా సమయంలో, రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను, 'విజయదశమి' రోజున చెడు శక్తుల పై మంచి (రాముడు) సాధించిన విజయానికి సూచకంగా, వేడుకగా తగలబెట్టి ఉత్సవంగా జరుపుకుంటారు.
నవరాత్రి సమయంలో, కొంతమంది దుర్గామాత భక్తులు ఉపవాసాలు ఉండి, ఆరోగ్యము, సంపదలను సంరక్షించమని ప్రార్థనలు జరుపుతారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి, అంతఃశోధనకు, ప్రక్షాళనకు నవరాత్రిని సంప్రదాయికంగా చాలా శుభప్రథమైన మరియు ఆధ్యాత్మికమైన సమయంగా భావిస్తారు.
మతపరమైన ఈ ఆచారం పాటించే సమయంలో, ఒక శుధ్ధి చేయబడిన ప్రదేశంలో ఒక కుండను (ఘటస్థాపన) ఉంచుతారు. ఆ కుండలో తొమ్మిది రోజులు ఒక దీపం వెలిగించి ఉంచుతారు. కుండ విశ్వానికి ప్రతీక. నిరంతరంగా వెలిగే దీపం మనం పూజించే దేదీప్యమానమైన ఆదిశక్తి అయిన దుర్గా దేవిని పూజించడానికి మాధ్యమం. నవరాత్రి సమయంలో శ్రీ దుర్గాదేవి యొక్క శక్తి వాతావరణంలో చాలా సక్రియాత్మకంగా ఉంటుంది.
చాలా పెద్ద సంఖ్యలో భారతీయ సముదాయాలు నవరాత్రి పండుగను జరుపుకుంటాయి. దేవీ మాత తొమ్మిది రూపాలలో కనిపిస్తుందని నమ్ముతారు, అందుకని ప్రతి రూపాన్ని ఒక్కో రోజు పూజిస్తారు. ఈ తొమ్మిది రూపాలు దేవి మనల్ని ప్రభావితం చేసే వివిధ గుణాలను ప్రతిబింబిస్తాయి. దేవి మాహాత్మ్యము, దుష్టశక్తుల ప్రభావం నుండి దేవిని రక్షణ కోరడం కోసం ఉద్దేశించిన ఇతర స్తోత్రాలతో దేవిని స్తుతిస్తారు.
దుర్గా మాత ఆయుధాలు మరియు వాటి అర్ధం :
దసరా నవరాత్రులు ఆశ్వీయుజ పాడ్యమి రోజున మొదలయ్యి నవమి తిధితో ముగుస్తాయి.పదవ రోజు అనగా దశమి రోజున దసరా ని భక్తులు ఎంతో ఉత్సాహం గా జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరాని జరుపుకుంటారు. దుర్గా మాత దానవుడయిన మహిషాసురుణ్ణి ఈరోజు సంహరించిందనీ మరియూ త్రేతా యుగం లో రాముడు కూడా రావణున్ని ఈరోజే సంహరించాడనీ రామాయణం తెలియచేస్తోంది.దసరా నవరాత్రుల్లో ప్రతీరోజూ దుర్గా మాతని మరియు ఆ అమ్మవారి శక్తి రూపాలయిన వివిధ అవతారలనీ పూజిస్తారు.
ఇప్పుడు మనం దుర్గా మాత యొక్క ఆయుధాలనీ వాటి ప్రాముఖ్యతనీ తెలుసుకుందాము.
శంఖం ప్రణవాన్ని లేదా ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపం లో అమ్మవారు కొలువై ఉందని అర్ధం.
ఇవి శక్తి ని సూచిస్తాయి.ధనుర్బాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని అమ్మవారు తెలియచేస్తున్నట్లు.
ఆవిడ చేతిలో ఉండే చక్రం ధృడ సంకాల్పానికి ప్రతీక. భక్తులు కూడా తమ నమ్మకాల పట్ల అంత ధృడం గా వ్యవహరించాలనీ ,ఎటువంటి ఆపద ఎదురొచ్చినా మొక్కవోని ధైర్యం తో ఎదుర్కోవాలనీ అర్ధం.
దుర్గా మాత చేతిలోని కమలం పూర్తిగా వికిసితమయ్యి ఉండదు.అంటే సఫలత అనివార్యమనీ కానీ అదే ఆఖరు మజిలీ కాదనీ అర్ధం.సంస్కృతం లో కమలాన్ని "పంకజం" అంటారు. అంటే బురద నుండి పుట్టినది అని అర్ధం. బురదలో కమలం వికసించినట్లు దురాశ, కోరికల మధ్యలో జీవిస్తున్న భక్తులు కూడా ఆధ్యాత్మికతని వికసింపచేసుకోవాలని సూచన అన్నమాట.
సుదర్శన చక్రం దుర్గా మాత యొక్క చూపుడు వేలు పైన వేలుకి తాకకుండా తిరుగుతూ ఉంటుంది.అంటే ఈ విశ్వం అంతా ఆ మాత యొక్క ఆఙకి లోబడి నడుస్తోందనడానికి సూచన.చెడు ని సంహరించి మంచి ని వృద్ధి చెయ్యడానికి ఈ సుదర్శన చక్రాన్ని అమ్మవారు వాడుతుంది.
దుర్గా మాత ధరించే ఖడ్గం కత్తి వంటి పదును గల ఙానాన్ని సూచిస్తుంది.అన్ని సందేహాలనుండీ విముక్తమైన ఙానం కత్తి వాదర వలే మెరుస్తుంది.
త్రిశూలం మూడు గుణాలైన సత్వ ,రజో , తమో గుణాలకి ప్రతీక.శారీరక,మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గా మాత తొలగిస్తుంది.
దుర్గా మాత నిర్భయం గా సింహం మీద నిలుచుని ఉంటుంది. ఇది అభయముద్ర. అంటే భయం నుండి విమోచనని సూచిస్తుంది. ఈ ముద్రలో అమ్మవారు భక్తులనుద్దేశించి " మీ కార్యాలు, విధుల భారాన్ని నా మీద వెయ్యండి, మిమ్మల్ని అన్ని భయాల నుండీ విముక్తులని చేస్తాను" అన్నట్లుగా ఉంటుంది.
దుర్గా పూజలోని 5 రోజుల ప్రాముఖ్యత(మహా షష్ఠి, సప్తమి, అష్ఠమి,నవమి, దశమి)
బెంగాలీ ల ముఖ్య పండుగైన దుర్గా పూజని దేశమంతా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.దుర్గా పూజనే కొన్ని ప్రాంతాల్లో దేవీ నవరాత్రులనీ, దసరా అనీ పిలుస్తారు.దుర్గా పూజ 5 రోజులు జరుగుతుంది, ఒక్కోరోజు దుర్గా దేవిని ఒక్కో పేరుతో పిలుస్తారు.
దుర్గాపూజలో దుర్గా మాతని జగన్మాతగా కొలుస్తారు.కేవలం హిందూ మతంలో మాత్రమే తల్లికీ, దేవుడితో సమానమైన హోదా ఇచ్చారు.ప్రపంచంలో మిగతా బంధాల కంటే అమ్మతో ఉన్న బంధం ప్రత్యేకమైనది.అందుకే దేవుడిని కూడా అమ్మతో పోల్చి దుర్గా మాత అని పిలుస్తాము.
జగన్మాత అయిన ఆ దుర్గా మాతకి వందనాలు.మానవులందరిలో దయ,బుద్ధి,అందం తదితర రూపాలలో కొలువయ్యుండే మాత లయకారుడైన పరమశివుని ఇల్లాలు.ఈ ఆర్టికిల్ ద్వారా దుర్గా పూజ జరిగే 5 రోజుల ప్రాశస్త్యాన్ని వివరించాము.ఒక్కోరోజు పూజలో ఏమేమి చేస్తారు, చేసే పద్దతి తదితర వివరాలు పొందుపరిచాము చూడండి.
మహా షష్ఠి:
తన పిల్లలయిన సరస్వతి,లక్ష్మి గణేశుడు,కార్తికేయునితో కలిసి సీంహ వాహనం మీద అమ్మ భూలోకనికి దిగి వచ్చే రోజిది.షష్ఠి పూజ రోజున అమ్మ ఒక్క దర్శనాన్ని భక్తులకి కల్పిస్తారు.దానికి ముందు ముఖ్య పూజలయిన ఆమంత్రణ్,బోధన్,అదిబష్ పూజలు చేస్తారు బెంగాలీలు.ఢాక్ అనే ఒక రకమైన వాయిద్యాన్ని వాయించడం ద్వారా అమ్మ రాకని తెలియచేస్తారు.
మహా సప్తమి:
మహా సప్తమి రోజున మహా పూజ మొదలవుతుంది.సూర్యోదయానికి ముందే ఒక అరటి చెట్టుని పవిత్ర జలాల్లో ముంచి తీసి దానికి కొత్త పెళ్ళి కూతురిలాగ చీర కడతారు.దీనినే "కోలా బౌ" అనీ "నబ పత్రిక" అనీ పిలుస్తారు.ఈ పూజని పీఠం మీద గణేశుని ప్రతిమ పక్కన చేస్తారు.ఈ పూజలో అదృష్టాన్ని ప్రసాదించమని దుర్గా మాతని వేడుకుంటారు.ఇదే రోజు 9 రకాల మొక్కలని కూడా దుర్గా అవతారాలుగా భావించి పూజిస్తారు.
మహా అష్ఠమి:
శాస్త్రాల ప్రకారం మహిషాసురుడిని అమ్మ సంహరించిన రోజిది.చెడుని రూపు మాపబడిందనే సంకేతం ఇవ్వడానికి పూర్వకాలంలో గేదెని మహారాజుకి ఇచ్చేవారు.సంస్కృతంలో ఉన్న "అంజలి" అని పిలువబడే శ్లోకాలని చదువుతూ అమ్మని ప్రస్తుతిస్తారు.ఇదే రోజున కుమారీ పూజ కూడా చేస్తారు. కుమారీ పూజ అంటే 9 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న అమ్మాయిలని దుర్గా మాతగా భావించి పూజ చేస్తారు.మహా అష్టమి, మహా నవమిల కలయిక అయిన సాయాంకాలం సంధి పూజ చేస్తారు.
మహా నవమి:
సంధి పూజ అవ్వగానే మహా నవమి పూజ మొదలయ్యి మహా ఆరతితో ముగుస్తుంది.దుర్గా పూజ నిర్వహించే వివిధ కమిటీలన్నీ కలిసి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
మహా దశమి:
దుర్గా పూజ చివరి రోజు "మహా దశమి".ఈరోజున దుర్గా మాత విగ్రహాన్ని పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేస్తారు.దేనినే "దుర్గా మాత విసర్జన్" అంటారు.నిమజ్జనం రోజున దుర్గా మాత విగ్రహాన్ని ఉత్సవంలాగా ఊరెరిగిస్తూ తీసుకెళ్తారు. ఈ ఉత్సవంలో భక్తితో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.వివాహమిన స్త్రీలందరూ ఒకరిమీద ఒకరు సింధూరాన్ని చల్లుకుంటారు. దీనినే "సింధూర్ ఖేలా" అంటారు.దుర్గా మాతని నిమజ్జనం చేసాక ఇండ్లకి తిరిగి వచ్చి స్నేహితులు, బంధువుల ఇళ్ళకి వెళ్ళి "విజయ దశమి" శుభాకాంక్షలు తెలియచేస్తారు.విజయదశమి రోజు బంధు మిత్రులతో కలిసి అనేక పిండి వంటలు చేసుకుని కలిసి భోజనం చేస్తారు.
Comments
Post a Comment