కళ్లుమూసుకుని ఉన్నప్పటికీ లైటు వేస్తే మనకు తెలుస్తుంది ఎందుకో తెలుసా ….!

కళ్లుమూసుకుని ఉన్నప్పటికీ లైటు వేస్తే మనకు తెలుస్తుంది ఎందుకో తెలుసా ….!

VADDEPALLYCHANDU.BLOGSPOT.COM

మన కనురెప్పలు (ఐ లిడ్స్‌) పలుచగా ఉండే గోపుర పేటిక (torsal plate) లాంటి రూపంలో ఉంటాయి. ఆలుచిప్ప ఆకారంలో ఉండే ఈ కనుగవ మధ్యలో దృఢమైన బంధన కణజాలం (conjuctive tissue) ఉంటుంది. పలుచని బాహ్యచర్మ కింద రబ్బరు పొరలాగా ముడుచుకోగలిగిన పారదర్శకమైన సబ్‌క్యుటీనియస్‌ పొర ఉంటుంది. ఇలా నాలుగైదు పొరల సముదాయమే అయినా కంటి రెప్ప మందం ఒక మిల్లీమీటరుకు మించి ఉండదు. ఇందులో కాంతిని శోషించుకునే పదార్థాలు పెద్దగా ఉండవు. కాబట్టి కళ్లు మూసుకుని ఉన్నా, బయట ఉండే కాంతిలో కొంత భాగం కనురెప్పల గుండా లోనికి వెళుతుంది. రెప్పలో ఉండే సూక్ష్మమైన రక్తనాళికల గుండా కాంతి వెళ్లడం వల్ల మనకు ఆ కాంతి ఎరుపు రంగులో ద్యోతకమవుతుంది. కళ్లు బాగా అదిమిపెట్టి ఉంచినప్పుడు ముడుతలు ఎక్కువవడం వల్ల కాంతి చాలా తక్కువే వెళ్లగలగడం వల్ల మనకు నల్లగా అనిపిస్తుంది

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు