మన హైదరాబాదులో కట్టడాలను నిర్మించిన వ్యక్తీ గురించి…మీకు తెలుసా…!

మన హైదరాబాదులో కట్టడాలను నిర్మించిన వ్యక్తీ గురించి…మీకు తెలుసా…!

హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు:

ఈ పేరు వింటే హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు పులకించిపోతాయి. నిజాం ప్రభుత్వంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన “మీర్ అలీ నవాబ్ జంగ్” ఎన్నో చారిత్రక కట్టడాలకు మార్గదర్శకుడు. హైదరాబాద్‌లోని పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు, బిల్డింగులు, బ్రిడ్జీలకు ఆయన రూపకల్పన చేశారు

  • ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ లాంటి చెరువులకు సృష్టికర్త మీర్ అలీ నవాబ్ జంగ్. అలాగే నిజామాబాద్‌లో ఉన్న అలీ సాగర్ రిజర్వాయర్ కు రూపమిచ్చింది ఆయనే. ఈ సమయంలో గోదావరి, మంజీరా నదులపై నిర్మించిన ప్రాజెక్టులు, అలాగే ఇతర భవన నిర్మాణాలు ఆయన మార్గదర్శకత్వంలోనే పురుడుపోసుకున్నాయి. ఖమ్మంలోని వైరా, పాలేరు బ్రిడ్జీలకు కూడా ఆయన హాయాంలో రూపకల్పన జరిగింది.
  • హైదరాబాద్ ఫతేనగర్ బ్రిడ్జీ నిర్మాణం కూడా నవాబ్ జంగ్ డిజైన్ చేసిందే. కృష్ణా, తుంగభద్ర నీటి మళ్ళింపు ఆలోచన చేసింది కూడా ఆయనే. మద్రాస్, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ భవనాన్ని కూడా నవాబ్ జంగ్ డిజైన్ చేశారు.
  • ఇలా ఒక్కటేంటి హైదరాబాద్‌లో ఉన్న అసెంబ్లీ భవనం, హైకోర్టు బిల్డింగ్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్, సెంట్రల్ లైబ్రరీ లాంటి చారిత్రక కట్టడాలకు మూలకారణం నవాబ్ జంగ్. ఆనాడు హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నింటికి రూపకల్పన చేసింది ఆయనే.
  • హైదరాబాద్ రాష్ట్రంలో జన్మించిన నవాబ్ జంగ్ నిజాం కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. జాతీయ ప్లానింగ్ కమిటీ ద్వారా నదులపై శిక్షణ పొందిన నవాబ్ జంగ్ ఇరిగేషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. నవాబ్ జంగ్ ప్రతిభను గుర్తించిన నిజాం ప్రభుత్వం 1896 సంవత్సరంలో ఇంగ్లండ్‌లోని కూపర్ హిల్ ఇంజినీరింగ్ కళాశాలకు పంపించింది. 1899లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆయన 1913వ సంవత్సరంలో పబ్లిక్‌వర్క్స్ విభాగంలో సహాయ ఇంజినీరుగా విధుల్లో చేరారు. పీడబ్ల్యూడీ, టెలిఫోన్ విభాగాలకు సెక్రటరీగా నియమితులయ్యారు.
  • 1918లో చీఫ్ ఇంజినీర్‌గా, 1929లో సెక్రటరీగానూ నియమించింది అప్పటి ప్రభుత్వం. సక్కూర్ బ్యారేజీ నిర్మాణం సందర్భంగా ముంబయి ప్రభుత్వం తమతో కలిసి పనిచేయాలని నవాబ్ జంగ్‌ను ఆహ్వానించిందంటే ఆయన ప్రతిభను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యక్తి మరణించినా అతని జ్ఞాపకాలు సమాజానికి చిరకాలం గుర్తు చేస్తుంటాయనేది నవాబ్ జంగ్ నిరూపించారు.
  • జూలై 11వ తేదీ ప్రఖ్యాత ఇంజినీర్ నవాబ్ జంగ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు తెలంగాణ సీఎం కేసీఆర్. నవాబ్‌జంగ్ సేవలను హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. నవాబ్‌జంగ్ జయంతిని ఇంజినీర్ల దినోత్సవంగా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.

Comments

Popular posts from this blog

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు