గ్యాస్ సిలిండర్ కి Expire డేట్ ఉంటుందని తెలుసా…?
మీకు తెలుసా…? గ్యాస్ సిలిండర్ కి Expire డేట్ ఉంటుందని తెలుసా…?
ఈ రోజుల్లో సామాన్యుడు కూడా నిరంతరం ఉపయోగించేది వంట గ్యాస్ మాత్రమే. అలాంటి వంట గ్యాస్ కొన్ని సార్లు హటాత్తుగా పేలి పోయిన సందర్బాలు లేకపోలేదు. అలాంటి గ్యాస్ సిలిండర్ కి కొన్న గుర్తులు గమనించే ఉంటారు. ఆ గుర్తులు సిలిండర్ పై బాగంలో ఉంటాయి.. ఆ గుర్తులే సిలిండర్ Expire తేది ని సూచిస్తాయి. ఆ సిలిండర్ కొన్ని సందర్బాలలో పేలి పోయినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ గ్యాస్ కంపెనీ ఆ వ్యక్తి మరణానికి కారణం అయితే ఆ గ్యాస్ కంపెనీ ఆ వ్యక్తి మరణానికి ఇన్సురెన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
సిలిండర్ Expire డేట్ గుర్తించాలి అంటే..
సిలిండర్ పై A,B,C,D శ్రేణులు మరియు వాటి పక్కన ఒక నెంబర్ తో ఉంటుంది. ఆ A,B,C,D లు A అంటే జనవరి నుంచి మార్చి వరకు B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు C అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు D అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పనిచేస్తాయి. దాని పక్కన ఉండే నెంబర్ సంవత్సరం ని తెలుపుతాయి
ఉదాహరణకి: పైన తెలిపిన ఇమేజ్ లోని D-17 అంటే D అంటే డిసెంబర్, 17 అంటే 2017 సంవత్సరం వరకు పనిచేస్తాయి.
ఈ గ్యాస్ సిలిండర్ తీసుకోనేముందు ఆ నెంబర్ చూసి జాగ్రత్తగా తీసుకోండి…
Comments
Post a Comment