తెలంగాణ దేవస్థానాలు
తెలంగాణ పర్యాటక ప్రదేశాలు (దేవస్థానాలు)
రామగిరిఖిల్లా
రామగిరి ఖిల్లా తెలంగాణ ప్రాంతంలో రామగిరి
వద్ద గల విశిష్టమైన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇది అద్భుత కళా
సంపదకు నిలువెత్తు నిదర్శనం. నాటి శిల్పుల నైపుణ్యతకు తార్కాణం.
విశేషాలు
రామగిరిఖిల్లా
రామగిరిఖిల్లా
చరిత్ర
క్రీశ 1వ శతాబ్దంలో రామగిరి కోటను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి పాలించినట్లు పెద్దబొంకూర్, గుంజపడుగు గ్రామాల్లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో బయటపడిన ఆధారాలు తెలుపుతున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్ధిపరిచారని చరిత్ర చెబుతుంది. క్రీశ 1158 లో చాళుక్య గుండ రాజును ఓడించి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనపరుచుకొన్నారు. రామగిరి ఖిల్లాను ప్రతాపరుద్రుడు 1195 వరకు పాలించినట్లు ఓరుగల్లు, మంత్రకూటమిల శాసనాలు తెలియపరుస్తున్నాయి. అనంతరం 1442 లో బహమనీ సుల్తానులు ఆక్రమించుకోగా వారి నుంచి రెడ్డి రాజులు స్వాధీనం చేసుకొన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అటుపిమ్మట 1595లో మొఘలాయిల స్వాధీనంలోకి వెల్లింది. 1606 లో గోల్కొండ నవాబుల ఈ దుర్గాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.వారి నుండి మహమ్మదీయులు వశపరుచు కొని నైజాం కాలం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతుంది. అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ఫిరంగులు 40 తోపులు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య కుదించుకుపోయింది. ప్రస్తుతం కేవలం ఒక్క ఫిరంగి మాత్రమే ఉంది. పౌరాణికంగాకూడా రామగిరి ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకుంది. శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కోటపైన సీతాసమేత శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలతో పాటు నంది విగ్రహం కూడా ఉంది. శ్రీరాముని విగ్రహం ఉన్న చోట సుమారు 1000 మంది తలదాచుకునేంత విశాల ప్రదేశం ఉండడం విశేషం. రాజులపాలనలో రామగిరిఖిల్లా పరిసర ప్రాంతానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని అంటారు. రాజుల ఆస్థానంలో సంగీత నృత్యకళాకారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అనేవారట. కాలక్రమేణ అది బోగంపేట మారింది.
శ్రావణం మాసం లో సందడే సందడి
వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడంతో... ప్రతి శ్రావణమాసంలో రామగిరిఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతారు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వనమూలికలను సేకరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళా సంపదకు నిలయమైన రామగిరిఖిల్లా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సివుంది. పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతా మని పాలకులు చెబుతున్న నేటికి ఆచరణకు అమలు కాలేదు.శిల్ప కళకు ఒడి
కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతుంది. పర్యాటకులను ఆహ్లదపరుస్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. ఇక్కడి నిర్మింపజేసిన రాతి కట్టడాలు అప్పటి శిల్ప కళానైపుణ్యాన్ని చాటుతాయి. రాతిపై చెక్కిన సుందర దశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుంది.రాముడు నడయాడిన నేల
వనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పారుచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్దలు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరించినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా నెలకొల్పబడివుంది.నాటి వాడలే నేటి పల్లెలు
రాజుల పరిపాలనాకాలంలో వాడలుగా పిలువబడిన రామగిరి దుర్గం చుట్టుపక్కల ప్రాంతాలు నేడు పల్లె సీమలుగా మారాయి. వాడల యొక్క విశిష్టతను బట్టి నేటికీ ఆ గ్రామాల పేర్లు అలాగే కొనసాగుతుండడం విశేసం. రత్నాలు విక్రయించే వీధిని రత్నాపూర్‌గా మహ్మదీయుల కాలంలో బేగాలు నివాసం ఉండేప్రాంతం నేడు బేగంపేటగా పిలవబడుతోంది. అదేవిధంగా పోతన పేరుతో ఉన్న వాడను పోతారంగా, ఆయన తల్లి లక్కమాంబ పేరుతో ఉన్న ప్రాంతాన్ని లక్కారం అని, నాగాళ్లు నిలిపేచోటును నాగెపల్లి అని, శుక్రవారం సంత జరిగేచోటును శుక్రవారం పేట అని ఆదివారం సంత జరిగేచోటు ఆదివారంపేటగా మైదపుపిండి విసురురాళ్ళు ఉండే చోటును మైదంబండ గా, గుండరాజు పేరున గుండారం అనే పేర్లు వాడుకలోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.చూడాల్సిన ప్రదేశాలు
రామగిరి దుర్గం అంతర్బాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యా టకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.రామగిరి చరిత్ర వెలుగులోకి వచ్చిన విధం
రామగిరి చరిత్రను వెలుగులోకి తీసుకరావడానికి పలువురు రచయితలు ఎంతో వ్యయ ప్రయాసలుకోర్చి రామగిరి చరిత్రను పుస్తకరూపంలో ప్రచురించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన యరబాటి బాబురావు, కమాన్‌పూర్ మండలానికి చెందిన మాధవ రావు, బలరాందాస్‌లు ‘రామగిరి మహత్యం’ పేరుతో ఓ గ్రంథాన్ని రాశారు. వీరికంటే ముందు రామగిరి చరిత్రను వెలికితీసిన ఘనత ఆర్.బాలప్రసాద్‌కే దక్కుతుందంటారు.కళ’ తప్పుతోందా
గత చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమైన రామగిరి ఖిల్లా... ప్రభుత్వం, పురావస్తు శాఖల నిర్లక్ష్యం మూలంగా కళావిహీనమవుతోంది. ప్రాచీన సంస్కృతికి, కళావైభ వానికి అద్దంపట్టిన ఇక్కడి కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంవుంది. ఇప్పటికైనా ఈ కళాసంపద కనుమరుగు కాకుండా ఈ చారిత్రాత్మక కళాసంపదను పరిరక్షించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అప్పటి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగర్‌రావు పాదయాత్ర చేపట్టి రామగిరిఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హమీ ఇచ్చారు. అయినా ఆ హామీ, హామీగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రామగిరిఖిల్లాను పర్యాటక కేంద్రాంగా తీర్చిదిద్ది అరుదైన కళాసంపదను కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.ఖిల్లాకు వెళ్లాలంటే
కరీంనగర్ జిల్లాకేంద్రం నుంచి తూర్పు దిశగా మంథని, కాళేశ్వరం వెళ్లే రహదారిలో 58 కిలోమీటర్ల దూరంలో వుంది రామగిరి దుర్గం. కమాన్‌పూర్ మండలంలోని నాగెపల్లి (బేగంపేట అడ్డరోడ్డు) నుంచి బేగంపేట గ్రామం మీదుగా నడుచుకుంటూ వెళితే రామగిరిఖిల్లాకు చేరుకోవచ్చు. ఈ రామగిరి ఖిల్లా సాంతం చూడాలంటే కనీ సం 16 కిలోమీటర్లు కొండపైన నడవాల్సి ఉంటుంది. రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకులు కాజీపేట - బల్లార్షా మార్గంలోని పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో దిగి బస్సు ద్వారా మంథని మార్గంలో బేగంపేటకు చేరుకోవచ్చు.వేములవాడ
| ?వేములవాడ తెలంగాణ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: 18.4681°N 78.8671°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 26.89 కి.మీ² (10 చ.మై)[1] |
| జిల్లా(లు) | కరీంనగర్ జిల్లా |
| జనాభా • జనసాంద్రత |
96,460[2] (2011 నాటికి) • 3,587/కి.మీ² (9,290/చ.మై) |
| భాష(లు) | తెలుగు |
| పురపాలక సంఘం | వేములవాడ పురపాలక సంఘము |
అంతే కాకుండా ఇక్కడ అతి పురాతనమైన భీమన్న ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ జాతకంలోని శని దోషం నివారణకు శని పూజలు జరుపుకుంటారు.
అలాగే ఈ భీమన్న ఆలయ సమీపంలో పోచమ్మ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులు తమ మొక్కుబడులను (అంటే కోడి, మేక వంటి జంతువులను అమ్మవారికి భలి ఇచ్చి) తీర్చుకుంటారు.
వేరే ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించుకుని రాత్రి పూట ఒక నిద్ర తీసి వెళతారు, అలా చేయటం వలన తమకు ఉన్న దోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం. అందుకు గాను ప్రభుత్వ వసతి గృహాలు ఇక్కడ ఉన్నయి, ప్రభుత్వ వసతి గృహాలతో పాటు ప్రైవేటు వసతి గృహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
నిద్రకోసం వచ్చే భుక్తులకు కాలక్షేపం కోసం వసతి గృహాలకు దగ్గరలో సినిమా హాల్లు కూడా ఉన్నాయి.
1830ల్లో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో ప్రస్తావించారు. తన యాత్రామార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి (డిచ్‌పల్లి సమీపంలోని గ్రామం) గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో వేములవాడ ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నారు.
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం
శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి. గ్రామాభివృద్ధి నిమిత్తం సంవత్సరానికి రూ. 8 లక్షలు ఖర్చు పెడితుంది దేవస్థానం.
కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరం లను పావనం చేసిన తరువాత శివుడు వేములవాడ వేంచేసాడని పురాణ కథనం.
ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజ రాజేశ్వర స్వామి అని, రాజన్న అనీ అంటారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి.
భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు
స్థలపురాణం
భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం.ఆలయప్రత్యేకతలు
- శివరాత్రి రోజున వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రివేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
- ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికిదక్షిణగా ఇచ్చేస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
- శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.
- దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ళ నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ, స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యర్ధం ఈ మసీదు నిర్మించారట.
వివిధ మతావలంబికుల దర్శన స్థలం
శైవులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి.ధర్మపురి (కరీంనగర్)
ఇది గోదావరి నది సరిహద్దులో ఉంది.మండల కేంద్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మండలంలో 22 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 29 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం ధర్మపురిలో గోదావరి ఒడ్డున 15వ శతాబ్ది కాలం నాటి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది.
భౌగోళిక స్వరూపం: ఈ మండలం జిల్లాలో ఈశాన్యం వైపున మంచిర్యాల జిల్లా సరిహద్దులో గోదావరి నది గోదావరి నది తీరాన ఉంది. ఈ మండల స్వరూపం త్రికోణం ఆకారంలో పైన మొనతేలి ఉంది.మంచిర్యాల జిల్లా సరిహద్దు, దక్షిణాన గొల్లపల్లి మండలం, ఆగ్నేయాన వెల్గటూరు మండలం, పశ్చిమాన సారంగాపూర్ మండలం, నైరుతిన జగిత్యాల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా: 2001 ప్రకారం మండల జనాభా 73230. ఇందులో పురుషులు 36124, మహిళలు 37106. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 76416. ఇందులో పురుషులు 37810, మహిళలు 38606.
ధర్మపురి స్థానం రవాణా సౌకర్యాలు: నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి నెంబర్ 63 కొత్త.ఓల్డ్ 16.మరియు రాష్ట్ర హైవే 7ఈ మండలం మీదుగా పోవుచున్నది. . రాజకీయాలు: ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
మండలంలోని గ్రామాలు: ఆరేపల్లి, ధర్మపురి, దొంతాపూర్, దోనూర్, జైన, కమలాపూర్, నాగారం, నేరెళ్ళ, రాజారం, రాయపట్నం, తీగలధర్మారం, తిమ్మాపూర్, తుమ్మెనాల,·
యోగనృసింహ క్షేత్రం
ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగియున్నది. ఈ క్షేత్రములో శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమం, శ్రీ ఉగ్రలక్ష్మీ నృసింహుని ఆలయంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ వేణు గోపాల స్వామి వార్ల ఆలయములు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.చరిత్ర
పది, పదకొండవ శతాబ్దాలలో ధర్మపురమని పేరు కలిగిని ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం ఉంది. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది. శాతవాహనులు, బాదామి చాళుఖ్యులు కళ్యాణి చాళుఖ్యులు, కాలంలో ఈ ఆలయం ఉన్నతి స్థితిలో వున్నట్లు తెలుస్తున్నది. నైజామ్ కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో వుండేది. క్రీ.శ. 1309లో అల్లాయుద్దిన్‌ఖిల్జి ధర్మపురి ఆలయాల పై దాడి చేసి నాసనం చేశాడని చరిత్ర వల్ల తెలుస్తున్నది.యోగాసీనుడైన శ్రీ లక్ష్మిసమేత నృసింహ స్వామి స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్ర రూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడవున్నది. ఇక్కడే శ్రీ రామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించినట్టు చెప్పబడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ధర్మ పురిలో అనేక ఇతర పురాతనమైన ఆలయాలు, మందిరాలు కూడా ఉన్నాయి. గోదావరి తీరంలో వున్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మ పురి ఆతి పురాతనమైనది ఆధ్యాత్మిక వేత్తల భావన. అనేక ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
కోటిలింగాల
ధర్మపురికి 15 కి.మీ దూరంలో వున్న కోటిలింగాలలో బయటపడిన శిలాఫలకాలు, శాతవాహనుల కాలం నాటి అంతకన్నా ముందరి రాజుల నాటి (సామగోపుని గోభద్రుడు) నాణేలు, అలాగే 2003లో పుష్కరాల సమయంలో భూమిని చదును చేస్తున్నపుడు బయటపడిన యజ్ఞవాటికలు, వాటిలో వాడిన ఇటుక, మొదలైనవి బయట పడ్డాయి.స్థల పురాణము
పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.అదనపు సమాచారం
- ఆతి పురాతనమైన ధర్మపురి క్షేత్రం కరీంనగర్ కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాల పురాతనమయిన ఆలయం. దీని మూలాలు వివిధ పురాణాలలో కూడా కనబడతాయి. ఇంకా అనేక శిలా శాసనాలలో కూడా దీని ప్రస్తావన ఉంది.
- గోదావరి, భద్ర నదుల సంగమస్థలమయిన ధర్మపురి అయిదు నరసింహాలయాలున్న ఏకైక గ్రామం. అందులో మూడు నరసింహాలయాలు నేటికీ పూజలందుకుంటున్నాయి. ఉపనిషత్తులు, పురాణాలలో నారసింహుని రూపము, తత్వము ఎలా చెప్పబడ్డాయో అవి ధర్మపురిలో ఎలా మనకి గోచరమవుతున్నాయో నరసయ్యగారు వివరించారు. 32 రకాల నారసింహ రూపాలు స్థలపురాణాలలో వర్ణించబడినాయట. ధర్మపురి గర్భాలయంలో ఉన్నది ప్రహ్లాదయుతుడైన నారసింహుడు. అలాగే నవవిధమైన నారసింహ తత్వాలున్నాయి. ధర్మపురిలో యోగనారసింహుడు, ఉగ్రనారసింహుడు, ప్రహ్లాదనారసింహుడు, లక్ష్మీనారసింహుడు అనే తత్వాలు ప్రకాశించాయి.
- ఇక్కడి ప్రధాన దేవాలయమైన శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమమునందు ఎక్కడా కనబడని బ్రహ్మ దేవుని విగ్రహము, యముని విగ్రహముండుట మిక్కిలి విశేషము. ఇక్కడికివచ్చిన యాత్రికులకు యముని దర్శనము వలన నరక బాధ ఉండదని క్షేత్రపురాణము తెలుపుతున్నది.
- ముఖ్యముగా ఇక్కడ పుణ్య గోదావరి నది సమీపములో నుండుటచేత యాత్రికులకు సకల పాపనివారణ కావడమేకాక ఎంతో ఆహ్లాదకరమైన పిక్ నిక్ సెంటర్ వలే గోదావరి ఒడ్డున సమయము గడుపుతారు. ఈ ప్రాంత గోదావరి ప్రమాదకరమైనది కాక స్వచ్ఛమైన నీటిప్రవాహము గలది.
- ధర్మపురిలోని రామేశ్వరాలయం భువనేశ్వర్ లోని లింగరాజస్వామి దేవాలయాన్ని పోలి వున్నదన్న విషయం, హంపిలోని షద్భుజ నారసింహ విగ్రహానికి మాతృక ధర్మపురిలోని మసీదు నారసింహాలయంలోని విగ్రహమేనన్న విషయం, ఇంకా ధర్మపురిలోని ఆలయ నిర్మాణాలకి, హంపిలోని నిర్మాణాలకి మధ్యన పోలికలు ఉన్నాయి.
సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభీ కరుణానిధేమామ్| ప్రహ్లాద భేద పరిహార పరవతార లక్ష్నీనృసింహ మమదేహి కరావలంబమ్|| సంసార కూప మతిఘోర మగాధమూలం సప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య| దీనస్యదేవ కృపాయ శరణాగతస్య లక్షీనృసింహ మమదేహి కరావలంబమ్|| అవి తొలుత ఆలా! శ్రీ నృసింహస్వామివారిని ప్రార్థించి ఆ స్వామి వారి ఆవిర్భావమునకు గల కారణాలు ఏమిటో? ఒక్కసారి మననంచేసుకుందాం! ఈ భూమిపై 'మానవుడు ' అవతరించిన నాటినుండి తనమనుగడకు ఆనందం కలిగించేవాటిని, తనలు అమ్మి వ్ధాలమేలును చేకూర్చే ప్రకృతి సంప్స్దకు "దేవతా స్వరూఅపాలు కల్పించి"వాటిని పూజిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము. అలా మానవుడు ఈ సృష్టిలోని చరాచరములను అన్నింటిని పూజ్త్యభావముతో చూడటం ఒక విశేషం!అంతేకాదు మన భారతీయ సంస్కృతిలో చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, కొన, నది,పర్వతాలు ఇలా ప్రకృతిలోని సంపదనూన్నిటిని పదిలపరుచుకునేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఉండటం మరోవిశేషం.అందువల్లనే మన భారతదేశము కర్మభూమిగా పేరుగాంచినది. అట్టి భారతీయుల ప్రబలమైన విశ్వాసము నకు ప్రామాణికమైనది ఈ న్ర్సింహస్వామి ఆవిర్భావచరిత్ర.. పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన 'జయ విజయులూ సంరక్షించుచూ ఉండు సమయాన,ఒక్కసారి సనక,సనందన,సనత్కుమార సనత్సజాతులైన బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై వస్తారు.వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల,శ్రీహరి దర్శనానికి వారిని అనుమతించక అడ్డగిస్తారు.దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా జన్మించండి అని శపిస్తారు.అలా శాపగ్రస్తులైన వారు ఇరువురు మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యాకశిపులుగా రెండవ జన్మలో రావణ,కుంభకఋణులుగా మూదవ జన్మలో శిశుపాల,దంతవక్త్రులుగా జన్మిస్తారు.అలా మొదటి జన్మలో దితి, కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మింస్చి ఘోరమైన తపస్సులుచేసి,ఆ వరగర్వంతో లోకకంటకులైనారు.దానితో దుష్టశిక్షా, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో వరాహావార రూపంలో హిరణ్యక్షుని ఆటలు కట్టించి హిరణ్యాక్షుని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు.
తన సోదర సంహారముపై మిక్కిలి ఆగ్రహించిన 'హిరణ్యకశిపుడు ' బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి దానవ పరిజ్ఞానముతో వివిధ రీతుల మరణము లేకుండ వరాలుపొంది.తనకు ఒక ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతో ఎన్నో అకృత్యాలు చేస్తూ విర్రవీగిపోతూ ఉంటాడు.అట్టి దానవ శ్రేష్ఠునకు నలుగురి కుమారులలో పెద్దకుమారుడైన "ప్రహ్లాదుడు"విష్ణుభక్తుడై తండ్రి అగ్రహానికి గురైనా, హరి నామస్మరణ వీడదు. దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. అక్కడ గురుకులాల్లో కూడా తోటి బాలురకు "హరినామ మాధుర్యాన్ని" పంచిపెడుతూ వారిచే కూడా హరికీర్తనలు పాడించేవాడు.చివరకు హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద,దండోపాయాలతో ప్రయత్నిస్తారు.అందువల్ల కూడా ఏ ప్రయోజనము పొందలేకపోతాడు.చివరకు పుత్రవాత్సల్యమనేది లేకుండ "ప్రహ్లాదుని" సంహరించుటకు వివిధ మార్గాలు అవలంబిస్తాడు.ప్రహ్లాదుని ఆగ్రహించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణము కాపాడుచున్న శ్రీహరి ఏక్కడరా?ఈ స్తంభమునందు చూపగలవా?అని ప్రశ్నిస్తాడు.అందుకు ప్రహ్లదుదు తండ్రీ!సర్వాంతర్యామి అయినా శ్రీహరి "ఇందుగలడందులేడను సందేహములేదు"ఎందెందు వెదకిన అందందే కలడు అని జవాబు ఇస్తాడు.అయితే ఈ స్తంభమునందు చూపగలవా?అని ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు. అంత శ్రీహరి 'హిరణ్యకసిపుడు ' తన దానవ పరిజ్ఞానుతో 'బ్రహ్మా వలన పొందిన వరాలు ఎమిటో?వాటిలోని లోపాలు క్షణకాలం అలోచించి, అంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశమునందుగాని,దిక్కులలోగాని, రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని, వెలుతురుగాని, నీటిజంతువులు, క్రూరమైన అడవిజంతువులవల్లగాని, సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని, మనుషులవల్లగాని,అస్త్రశస్త్రాలవల్లగాని,ఇంటగాని,బయతగాని,చావులేకుండా పొందిన వరాలకు అనుగుణమైన రూపుదాల్చి హరిణ్యకశివుడు మొదిన స్తంభమునుండి తన అవతారాలలో 'నాలుగవ అవతారం'"శాశ్వత అవతారం"అంటే!నిర్యాణము పొందిన రాముడు.కృష్ణుడువంటి అవతారముల వలెకాకుండా!సద్యోజాతుడై అంటే అప్పటి కప్పుడు అవతరించినవాడు మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా! స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ "నృసింహ అవతారము" శాశ్వతమైనదిగా చెప్పబడింది. అలా ఈ శ్రీ నృసింహస్వామివారు వైశాఖ శుక్లపక్షములో పూర్ణిమకు ముందువచ్చే 'చతుర్దశి 'నాడు ఆఆవిర్భవించారు.ఆపుణ్యదినమునే మనం "శ్రీనృసింహ జయంతి"గా జరుపుకుంటూ ఉంటాము.ఇది క్తయుగంలో వచ్చిన పరిశుద్ధావతారం. "వైశాఖ శుక్ల పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్,మజ్జన్మ సంభవం వ్రతం పాపప్రణాశనం"అని సాక్షాత్తు శ్రీహరి స్వ్యంగా ప్రహ్లాదునితో చెప్పినట్లు "నృసింహపురాణం"లో చెప్పబడినది. ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యయామి)అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశివుడు మోదిన స్తంభము ఫెళఫెళమని విరగిపడుచుండగా భూనభోంతరాలన్ని దద్దరిల్లేలా సింహగర్జనతో ప్రళగర్జన చేస్తూ! ఉగ్రనరసింహ రూపంతో ఆవిర్భవిస్తాడు.అట్టి స్వామి ఆకారంచూస్తే సింహంతల,మానవశరీరం.సగం మృగత్వం,సగం నరత్వం.ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం,కరుణ,ఉగ్రత్వం,ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన ఆ స్వామి "హిరణ్యకశివుదు"పొందిన వరాలను చేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము "గడపపైన"మృగ నరలక్షణాలతో గూడి,ఒక్క ఉదుటన హిరణ్యజశిపుని మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి జీవము నిర్జీవముకాని గోళ్ళతో హిరణ్యకశిపుని ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు.
అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు ఎవ్వరు శాంతింప చేయలేక,దేవతలందరు ప్రహ్లాదుని ఆ స్వామిని శాంతింప చేయమని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు.అట్టి స్వామి నిర్యాణములేని అవతారమూర్తిగా,పిలిస్తే పలికేదైవంలా భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాబడచూ పూజించబడుచున్నారు.
Comments
Post a Comment