Posts

Showing posts from September, 2017

బార్ కోడ్స్ ఎందుకు ఉపయోగిస్తారు?

Image
బార్ కోడ్స్ ఎందుకు ఉపయోగిస్తారు? రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్‌లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను 'బార్ కోడ్స్' అంటారు. * వీటిలో ఆయా వస్తువులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. బార్ కోడ్‌లోని వివరాలను స్కానర్ లేదా రీడర్ అనే యంత్రం సాయంతో తెలుసుకోవచ్చు. కంప్యూటర్‌తో అనుసంధానించి ఉండే ఈ స్కానర్ ద్వారా వివరాలు 0,1 సంఖ్యలు ఉండే బైనరీకోడ్ రూపంలో తెరపై పడతాయి. * ఈ కోడ్‌తో సరితూగే సమాచారాన్ని కంప్యూటర్ అందిస్తుంది. వస్తువులపై ఉండే బార్‌కోడ్‌ను స్కానర్ ఎదుట పెట్టగానే, స్కానర్ నుంచి వచ్చే లేజర్ కిరణాలు దానిపై పడి పరావర్తనం చెందుతాయి. స్కానర్‌లోని దర్పణం ఆ సంకేతాలను కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌లో ఇవి విద్యుత్‌సంకేతాలుగా మారి తెరపై 0,1 సంఖ్యల రూపంలో కనిపిస్తాయి. * బార్ కోడ్‌లో ఆ వస్తువు ఏ దేశంలో ఎప్పుడు తయారైనదో, ఎవరు దానిని ఉత్పత్తి చేశారో, ధర ఎంతో లాంటి వివరాలు ఉంటాయి. బార్ కోడ్‌లలో అనేక రకాలు ఉంటాయి. కోడ్‌లలో గీతలకింద సంఖ్యలతో సూచిస్తారు. ఉదాహరణకు సాధారణంగా మార్కెట్లో కనిపించే వస్తువులకు చెందిన కోడ్ (యూనివర్సల్ ప...

పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Image
పుస్తకాలు చదవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Books And Health Go Hand-In-Hand) కొంతమంది వ్యక్తులు వారి ఇంటిలో వేలకొద్ది పుస్తకాలను పెట్టుకుని, తరచూ ఏదో ఒకటి చదువుతూ ఉంటారు, అయితే మరికొంతమందికి ఒకటి లేదా రెండు పేజీల చదివితేనే నిద్ర వస్తుంది. మీరు రెండవ వర్గానికి చెందినట్లయితే, మీరు పలు ప్రయోజనాలను కోల్పోతున్నట్లు దయచేసి గమనించండి. అవును, మీకు స్పష్టంగా చెబుతాము వినండి – ఈ సందర్భంలో చదవడం అంటే నిజమైన పుస్తకాలు, మ్యాగజైన్‌లు, ఇబుక్‌లు లేదా వార్తాపత్రికలు చదవడం అని అర్థం, ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లను చదవడం కాదు! మేము చదవడం వలన కలిగే ప్రయోజనాలు మేము దిగువన పేర్కొన్నాము, వీటిని చదవడం వలన మీరు తక్షణమే మంచి పుస్తకాన్ని చదవడం ప్రారంభించడానికి కావల్సిన ఉత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నాను.... మీ మెదడు వికసిస్తుంది (Stimulates your mind): చదవడం వలన మీ మెదడు వికసిస్తుందని పెద్దలు చెబుతారు. చదవడం వలన మీ మనస్సు ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ మెదడును పేజీలోని పదాలను చదవడానికి మాత్రమే కాకుండా, చదివిన అంశాలను ఊహించుకుంటారు మరియు ఒక నిర్ధారణకు వస్తారు. చదవడం వలన అల్జీమర్స్ వ్...

మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్

Image
“అలెక్జాండర్ విశ్వవిజేత కాదు, మన రాజు పురుషోత్తముడి చేతిలో ఓడిపోయాడు” మన రాజు పురుషోత్తముడి చేతిలో దెబ్బతిన్న అలెక్జాండర్ విజయగాథల మీద ఆధారపడి నిర్మితమైన సంస్కృతి అసాధారణ ఫలితాలనిస్తుంది, అది మహోన్నత చరిత్రను సృష్టిస్తుంది. అయితే నేటి విద్యార్థులకు మనం ఎలాంటి చరిత్రను చెబుతున్నాం. మనదైన చరిత్రపై వారికి అవగాహన లేదు. వ్యాపారం పేరుతో వచ్చి, మోసంతో మన దేశాన్ని ఆక్రమించుకున్న ఆంగ్లేయులు మనదైన ప్రతి వ్యవస్థనీ నాశనం చేశారు. మన చరిత్రనీ వక్రీకరించారు. మనది పరాక్రమ చరిత్ర కాదు, పరాజయ చరిత్రే అని అసత్యాలను వ్యాపింపజేశారు. బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత కూడా ఆ చరిత్ర పాఠాలనే కొనసాగిస్తూ వచ్చారు. మరి మనలో స్వాభిమానం ఎలా నెలకొంటుంది? గర్వదాయకమైన మన వీరుల చరిత్రను పిల్లలకి పాఠాలుగా బోధించినపుడే మన సమాజంలో “చరిత్రను సృష్టించే వీరులు” తయారవుతారు. శివాజీకి జిజియామాత బాల్యంలోనే రామాయణ, మహాభారత గాధలు, చరిత్రలోని స్ఫూర్తివంతమైన కథలు చెప్పింది కాబట్టే ఆయన అంత గొప్ప వాడయ్యాడు. మన విద్యార్థుల్లో దేశభక్తి పెంచే విధంగా చరిత్ర రచన కొనసాగాలి. మనదేశ చరిత్రని గమన...

కడప “అమీన్ పీర్ దర్గా” అంటే ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఎందుకో తెలుసా…!

Image
కడప “అమీన్ పీర్ దర్గా” అంటే ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఎందుకో తెలుసా…! అమీన్ పీర్ దర్గా (ఆస్థాన్-ఎ-మగ్దూమ్-ఇలాహి దర్గా) తరాలు మారినా అవిచ్ఛిన్నంగా పరిఢవిల్లుతూ సర్వమతాల సంస్కృతీ ప్రతీకగా వెలుగొందుతోంది కడప పెద్ద దర్గా (అమీన్ పీర్ దర్గా). మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లిం, క్రైస్తవులు నిత్యం పెద్ద ఎత్తున దర్శించుకుని ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక సంపదకు, భక్తి శ్రద్ధలకు నిలయమైన మన దేశంలో వెలసిన ఈ దర్గాలో సాహెబ్‌ను దర్శించి విభూది తీర్థం సేవిస్తే సర్వ వ్యాధులు హరిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో కొలువైన ఈ అమీన్ పీర్ దర్గాను కడప జిల్లా వాసులు పెద్ద దర్గాగా పిలుస్తుంటారు. ఈ పెద్ద దర్గా ప్రాంగణంలో 18 మజార్‌లు కలిగిన దర్గా ఉంది. ఇక్కడ సంవత్సరంలో ప్రతినెలలోనూ గంధం, ఉరుసు ఉత్సవాలు జరుగుతుంటాయి. అందులో 5 దర్గాలకు చెందిన మజార్‌లకు మాత్రమే ప్రత్యేకంగా ఉరుసు ఉత్సావాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. దర్గా చరిత్రను చూస్తే.. ఆస్తానే-యే-ముగ్దుమ్ ఇలాహి ప్రథమ సూఫీ హజ్రత్ ఖ్వాజా సయ్యద్‌షా ప...

ఒంగోలు జాతి గిత్త అంటే ప్రపంచంలో అంట విశిష్టత ఎందుకో తెలుసా ….!

Image
ఒంగోలు జాతి గిత్త అంటే ప్రపంచంలో అంట విశిష్టత ఎందుకో తెలుసా …..! ఒంగోలు జాతి గిత్త ప్రపంచంలోనే పేరెన్నిక గన్న పశువుల జాతి ఒంగోలు జాతి. ఒంగోలుకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన జాతి ఇది. ఇవి బలిష్టమైన కాయంతో, చూడముచ్చటైన రూపంతో ఉంటాయి. కష్టతరమైన దుక్కి దున్నడం వంటి పనులకు ఒంగోలు జాతి గిత్త బాగా అనువైనది. ఒంగోలు జాతి పాడి ఆవులు ఈతకు ఈతకు మధ్య 3000 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఒంగోలు జాతి పశువులు 1863లో మొదటిసారిగా బ్రెజిల్ దేశానికి ఎగుమతి అయ్యాయి. బ్రెజిల్, అర్జెంటైనా, పరాగ్వే, మెక్సికో, అమెరికా, శ్రీలంక, ఫిజీ, జమైకా, ఇండోనేషియా, మలేషియా వంటి అనేక దేశాలు ఒంగోలు జాతి పశువులను దిగుమతి చేసుకుంటున్నాయి. బాస్ ఇండికస్ (Bos indicus) అనే పశువుల కుటుంబానికి భారత ఉపఖండం నిధి వంటిది. వ్యవసాయ పనులకు గాని, పాలు, మాంసానికి గాని ఈ జాతి పశువులు ప్రశస్తమైనవి. నేల, వాతావరణం, దొరికే గ్రాసం వంటి వాటిని బట్టి ఈ కుటుంబంలో 30 వరకు వివిధ జాతుల పశువులు అభివృద్ధి చెందాయి. వీటి పేర్లు ఆయా ప్రదేశాల పేర్లను బట్టి వచ్చాయి. ఈ జాతుల్లో సింధీ, సహివాల్, కంక్రేజ్, గిర్, ...

మన హైదరాబాదులో కట్టడాలను నిర్మించిన వ్యక్తీ గురించి…మీకు తెలుసా…!

Image
మన హైదరాబాదులో కట్టడాలను నిర్మించిన వ్యక్తీ గురించి…మీకు తెలుసా…! హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు: ఈ పేరు వింటే హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు పులకించిపోతాయి. నిజాం ప్రభుత్వంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన “మీర్ అలీ నవాబ్ జంగ్” ఎన్నో చారిత్రక కట్టడాలకు మార్గదర్శకుడు. హైదరాబాద్‌లోని పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు, బిల్డింగులు, బ్రిడ్జీలకు ఆయన రూపకల్పన చేశారు ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ లాంటి చెరువులకు సృష్టికర్త మీర్ అలీ నవాబ్ జంగ్. అలాగే నిజామాబాద్‌లో ఉన్న అలీ సాగర్ రిజర్వాయర్ కు రూపమిచ్చింది ఆయనే. ఈ సమయంలో గోదావరి, మంజీరా నదులపై నిర్మించిన ప్రాజెక్టులు, అలాగే ఇతర భవన నిర్మాణాలు ఆయన మార్గదర్శకత్వంలోనే పురుడుపోసుకున్నాయి. ఖమ్మంలోని వైరా, పాలేరు బ్రిడ్జీలకు కూడా ఆయన హాయాంలో రూపకల్పన జరిగింది. హైదరాబాద్ ఫతేనగర్ బ్రిడ్జీ నిర్మాణం కూడా నవాబ్ జంగ్ డిజైన్ చేసిందే. కృష్ణా, తుంగభద్ర నీటి మళ్ళింపు ఆలోచన చేసింది కూడా ఆయనే. మద్రాస్, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ఇది. ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ భవనాన్ని కూడా నవాబ్ జంగ్ డిజైన్ చేశారు. ఇలా ఒక్కటేంటి...

రామాయణం లోని మనకి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..!

Image
రామాయణం లోని మనకి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..! written by                 VADDEPALLYCHANDU.BLOGSPOT.COM రామాయణం లోని ఆసక్తికర విషయాలు: రామాయ‌ణం గురించి అందరికీ తెలిసిందే. చిన్నారులు మొద‌లు కొని పెద్ద‌ల వ‌రకు అంద‌రూ ఇప్ప‌టికే చాలా సార్లు రామాయ‌ణాన్ని చ‌దివి ఉంటారు. సినిమాలు, టీవీ సీరియ‌ల్స్‌లో ఈ పురాణాన్ని గురించి తెలుసుకుని ఉంటారు కూడా. విద్యార్థుల‌కైతే పాఠ్యాంశాల్లోనూ రామాయ‌ణ‌, మ‌హాభార‌తాల గురించి తెలుస్తుంటాయి. రామాయ‌ణంలో సీతారాముల జ‌న‌నం మొద‌లుకొని చివ‌రికి ల‌వ‌కుశుల వ‌ర‌కు దాదాపుగా అన్ని ఘట్టాల గురించి అంద‌రూ విని ఉంటారు. అయితే రామాయ‌ణం గురించి మ‌నం తెలుసుకోవాల్సిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే… లంకా న‌గ‌రాన్ని హనుమంతుడైతే గాల్లో ఎగిరి చేరుకుంటాడు. అదే రావ‌ణుడిపై యుద్ధానికి వెళ్లేందుకు రాముడు, ల‌క్ష్మ‌ణుడు స‌హా వాన‌ర సేన మొత్తం స‌ముద్రాన్ని దాటేందుకు దానిపై రాళ్లతో వంతెన నిర్మిస్తారు క‌దా. అది కొన్ని వంద‌ల మైళ్ల దూరం ఉంటుంది. దాన్ని రామ‌సేతువు అని కూడా అంట...

రాత్రి పూట గోళ్ల‌ను క‌త్తిరించ‌వ‌ద్దంటారు… ఎందుకో తెలుసా..?

Image
రాత్రి పూట గోళ్ల‌ను క‌త్తిరించ‌వ‌ద్దంటారు… ఎందుకో తెలుసా..? VADDEPALLYCHANDU.BLOGSPOT.COM మ‌న శ‌రీరంలో జీవం లేకున్నా పెరిగే వాటిలో గోళ్లు, వెంట్రుక‌లు ముఖ్య‌మైన‌వి. వెంట్రుక‌లనైతే పార్ల‌ర్‌కో, సెలూన్‌కో వెళ్లి క‌ట్ చేయించుకుంటాం. అదే గోర్ల‌నైతే దాదాపుగా ఇంట్లోనే తీసుకుంటాం. అయితే కొంద‌రు గోర్ల‌ను స్టైల్, లుక్ కోసం పెంచుకుంటారు లెండి. అది వేరే విష‌యం. కాక‌పోతే ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న‌ది మాత్రం గోళ్ల‌ను క‌ట్ చేయ‌డం గురించి. అవును, అదే. కొంద‌రైతే చాలా చిన్న‌గా వ‌చ్చే వ‌ర‌కు గోళ్ల‌ను క‌ట్ చేస్తారు. కొంద‌రు చాలా వ‌ర‌కు పెంచి క‌ట్ చేస్తారు. ఇంకా కొంద‌రు ఎప్ప‌టిక‌ప్పుడు గోళ్ల‌ను క‌ట్ చేసుకునే ప‌నిలోనే ఉంటారు. అయితే ఎలా క‌ట్ చేసినా గోళ్ల‌ను ప‌గ‌టిపూటే క‌ట్ చేయాల‌ట‌… రాత్రి పూట క‌ట్ చేయ‌కూడ‌ద‌ట‌… అది ఎందుకంటే..! గోళ్ల‌ను రాత్రి పూట క‌త్తిరించ‌కూడ‌ద‌నే మాట‌కు రెండు కార‌ణాల‌ను ప్ర‌ధానంగా మ‌నం చెప్ప‌వ‌చ్చు. అందులో ఒక‌టి ఏమిటంటే… వెనుక‌టికి గోళ్ల‌ను క‌ట్ చేసుకునేందుకు ఎక్కువగా బ్లేడ్ల‌ను లేదా క‌త్తెర‌ల‌ను వాడేవారు. ఈ క్ర‌మంలో ఆ స‌మ‌యంలో రాత్రి పూట క‌రెంట్ కూడా...

మనం వాడే గొట్టపు మాత్రలు వెజ్జా? నాన్ వెజ్జా?.. అందరూ తెలుసుకోవాల్సిన విషయం!!

Image
మనం వాడే గొట్టపు మాత్రలు వెజ్జా? నాన్ వెజ్జా?.. అందరూ తెలుసుకోవాల్సిన విషయం!! written by                vaddepallychandu.blogspot.com    అందరూ తెలుసుకోవాల్సిన విషయం మనకు ఏ చిన్న జబ్బు చేసినా డాక్టర్ ని సంప్రదిస్తాం. ఆ డాక్టరు మనల్ని పరీక్షించి, కొన్ని టాబ్లెట్లు, టానిక్ లేదంటే కాప్సుల్స్ మందులుగా రాసి వాడమంటారు. మనం వాడేసి పారేస్తాం. మనందరం ఇప్పటివరకు ఎన్నో గొట్టపు మాత్రలు వేసుకునే ఉంటాం. సాధారణంగా అల్లోపతీ, ఆయుర్వేదంలో ఈ గొట్టపు మాత్రలు ఎక్కువగా వాడుతారు. ఈ గొట్టపు మాత్ర లోపల అసలు మందు మిశ్రమాన్నినింపుతారు. కానీ పైనుండే ఈ గొట్టపు మాత్ర మాత్రం మాంసాహారమేనట. ఈ కాప్సుల్ లేదా గొట్టపు మాత్రని గెలాటిన్ తో తయారు చేస్తారట. జంతువుల ఎముకలు, కీళ్ళు ఇతర భాగాలను బాగా ఉడికించడం ద్వారా గెలాటిన్ తయారవుతుంది. దీన్ని బట్టి గొట్టపు మాత్ర మాంసమే అని చెప్పొచ్చు. అయితే… మాంసాహార పదార్థంతో గొట్టం తయారీ వల్ల.. ఈ గొట్టపు మాత్రలలో రోగకారక వైరస్ లు ఉండే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇవి ఎక్కువగా వాడితే కడుప...

శ్రీ రాముని పుత్రులు నిర్మించిన నగరాలు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు…!

Image
శ్రీ రాముని పుత్రులు నిర్మించిన నగరాలు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు…! CLICK ON-## VADDEPALLYCHANDU.BLOGSPOT.COM ## పాకిస్థాన్ లోని ప్ర‌ధాన న‌గ‌రాలైన వాటిలో నాలుగు న‌గ‌రాల‌ను శ్రీరాముని త‌న‌యులైన ల‌వ‌,కుశ‌లు….భ‌ర‌తుని కుమారులైన త‌క్షుడు, పుష్క‌రుడు క‌ట్టించార‌ట‌. అప్ప‌ట్లో ఈ న‌గరాలు పేర్లు కూడా క‌ట్టించిన వారి పేరు మీదుగానే ఉండేవ‌ట‌, కాల‌క్ర‌మేణా….వాటి పేర్ల‌లో మార్పులు సంభ‌వించాయ‌ట‌, మార్పులొచ్చిన‌ప్ప‌టికీ వాటి పేర్లు ఒరిజిన‌ల్ పేర్లకు ద‌గ్గ‌ర‌గా ఉండడం విశేషం. ఆ న‌గ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఖాసూర్ దీని అస‌లు పేరు కుశపురం….దీనిని శ్రీరాముడి పెద్ద‌ కుమారుడు కుశుడు క‌ట్టిచాడు, అత‌ని పేరు మీదుగానే ఈ న‌గ‌రానికి కుశపురం వ‌చ్చింది, త‌ర్వాత‌ర్వాత‌….కుశపురం కాస్త‌…ఖాసూర్ గా రూపాంత‌రం చెందింది. 2. లాహోర్ దీని అస‌లు పేరు ల‌వ‌పురం….దీనిని శ్రీరాముడి చిన్న కుమారుడు ల‌వుడు క‌ట్టిచాడు, అత‌ని పేరు మీదుగానే ఈ న‌గ‌రానికి ల‌వ‌పురం వ‌చ్చింది, త‌ర్వాత‌ర్వాత‌….ల‌వ‌పురం కాస్త‌…లాహోర్ గా రూపాంత‌రం చెందింది. ౩. తక్షశిల దీనిన...

కళ్లుమూసుకుని ఉన్నప్పటికీ లైటు వేస్తే మనకు తెలుస్తుంది ఎందుకో తెలుసా ….!

Image
కళ్లుమూసుకుని ఉన్నప్పటికీ లైటు వేస్తే మనకు తెలుస్తుంది ఎందుకో తెలుసా ….! VADDEPALLYCHANDU.BLOGSPOT.COM మన కనురెప్పలు (ఐ లిడ్స్‌) పలుచగా ఉండే గోపుర పేటిక (torsal plate) లాంటి రూపంలో ఉంటాయి. ఆలుచిప్ప ఆకారంలో ఉండే ఈ కనుగవ మధ్యలో దృఢమైన బంధన కణజాలం (conjuctive tissue) ఉంటుంది. పలుచని బాహ్యచర్మ కింద రబ్బరు పొరలాగా ముడుచుకోగలిగిన పారదర్శకమైన సబ్‌క్యుటీనియస్‌ పొర ఉంటుంది. ఇలా నాలుగైదు పొరల సముదాయమే అయినా కంటి రెప్ప మందం ఒక మిల్లీమీటరుకు మించి ఉండదు. ఇందులో కాంతిని శోషించుకునే పదార్థాలు పెద్దగా ఉండవు. కాబట్టి కళ్లు మూసుకుని ఉన్నా, బయట ఉండే కాంతిలో కొంత భాగం కనురెప్పల గుండా లోనికి వెళుతుంది. రెప్పలో ఉండే సూక్ష్మమైన రక్తనాళికల గుండా కాంతి వెళ్లడం వల్ల మనకు ఆ కాంతి ఎరుపు రంగులో ద్యోతకమవుతుంది. కళ్లు బాగా అదిమిపెట్టి ఉంచినప్పుడు ముడుతలు ఎక్కువవడం వల్ల కాంతి చాలా తక్కువే వెళ్లగలగడం వల్ల మనకు నల్లగా అనిపిస్తుంది

ఎల్లోరా గుహల చరిత్ర - విశిష్టత

Image
ఎల్లోరా గుహల చరిత్ర విశిష్టత ఎలా చెక్కారు ఎన్నో విలువైన రహస్యాలు మీకోసం ….! VADDEPALLYCHANDU.BLOGSPOT.COM ఎల్లోరా గ్రామము మహారాష్ట్రలో ఔరంగాబాద్కు 30 కి.మీ. దూరములో ఉంది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటి నిర్మాణం కాలం క్రీ.పూ 600 నుంచి 800 మధ్య ఉంటుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణ కాలం క్రీ.పూ 600 నుంచి 900 మధ్యలో ఉంటుంది. 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం క్రీ.పూ 800-1000. ఈ గుహలన్నీ పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చాటి చెబుతున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయి. ఇందులో బౌద...

దసరా నవరాత్రులు,దుర్గా మాత యొక్క ఆయుధాల ప్రాముఖ్యత

Image
నేటి నుంచి దేవీ నవరాత్రోత్సవాలు  నవరాత్రులలో తొమ్మిది రూపాలలో శక్తిని ఆరాధిస్తారు. స్థలసంప్రదాయాన్ని బట్టి దేవతల రూపాలు మారుతూ ఉంటాయి. 1.భద్రకాళి 2.అంబ లేదా జగదంబ, విశ్వానికి మాత 3.అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లి (పూర్ణ: వైయక్తికంగా ఉపయోగిస్తారు) 4.సర్వమంగళ, అందరికీ (సర్వ) మంచి (మంగళ) చేకూర్చే తల్లి 5.భైరవి 6.చంద్రిక లేదా చండి 7.లలిత 8.భవాని 9.మూకాంబిక ఆచారకర్మలు : చంద్రమాసమయిన అశ్విన మాసంలోని ప్రకాశవంతమయిన పక్షంలోని మొదటి రోజున (ప్రతిపాదం) నవరాత్రులు మొదలవుతాయి. అక్టోబరు మాసం మొదలయినపుడు ప్రతి సంవత్సరం తొమ్మిది రాత్రులు ఈ పండుగను జరుపుకుంటారు; చంద్ర పంచాంగం ప్రకారం తేదీలను నిర్ణయించినా కూడా ఈ పండుగను ఒక రోజు అటూ ఇటూగా జరుపుకోవచ్చు. నవరాత్రులను వివిధ పధ్ధతులతో దేశమంతా ఉత్సవంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మూడు నవరాత్రులనూ అత్యంత ఆదరణతో, తొమ్మిది రోజులూ ఉపవాసం ఉంటూ, దేవీ మాతను వివిధ రూపాలలో పూజిస్తూ జరుపుకుంటారు. చైత్ర మాసంలో జరుపుకునే నవరాత్రి శ్రీ రామ నవమితోనూ, శరద్ నవరాత్రి దుర్గా పూజతోనూ, దసరాతోనూ పరాకాష్ఠకు చేరుకుంటుంది. హిమాచల్ ...

బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఎలా చేస్తారు?బతుకమ్మ పండగ వెనుక ఆసక్తికర కథ..

Image
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఎలా చేస్తారు?బతుకమ్మ పండగ వెనుక ఆసక్తికర కథ.. బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ.రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలుపాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే..తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స...

బోగత జలపాతం

Image
బొగత వాటర్‌ఫాల్స్    బోగత జలపాతం బొగత వాటర్‌ఫాల్స్ చీకులపల్లి ఫాల్స్ అనికూడా అంటారు. కాళేశ్వరం - భద్రాచలం అడవుల మధ్యన ఇది ఉన్నది. 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద పెద్ద జలాశయం గా ఏర్పడుతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండకోన ల్లో నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం బొగత. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి. ప్రదేశం కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడు కు వెళ్లాలి. వాజేడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడ్నుంచి మరో మూడు కిలోమీటర్లు వెళ్లే బొగత జలపాతం వస్తుంది. ఖమ్మం నుంచైతే 240 కిలోమీటర్లు. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని బొగత హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరం. వరంగల్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో.. ఏటూరు నాగారం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బొగత ఉంటుంది. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు.